త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sarus Crane | ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కొంగ పరిరక్షణ కోసం రైతుల ముందడుగు

ఎక్కడ ఆ పక్షి గుడ్లు, గూడు కనిపించినా వాటిని నాశనం చేయకుండా వాటిని అక్కడి రైతులు కాపాడుకుంటూ వస్తున్నారు. దీంతో వాటి జాతి నెమ్మదిగా పెరుగుతోంది.

J

Agriculture | Published On Dec 23, 2025, 6.10 pm IST

Sarus Crane | ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కొంగ పరిరక్షణ కోసం రైతుల ముందడుగు

సంక్షిప్త సారాంశం

ఒక కొంగ జాతిని పరిరక్షించడం కోసం ఆ రాష్ట్ర రైతులంతా ముందుకొచ్చారు. ప్రపంచంలోనే అరుదైన జాతికి చెందిన, ఆకాశంలో ఎగిరే అత్యంత పొడవైన కొంగ అది. దాన్ని పరిరక్షిస్తే రైతులకేంటి లాభం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షిగా దాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? వ్యవసాయంలో ఆ కొంగ ప్రాముఖ్యత ఏంటి? ఓవైపు తమ పంటలను నాశనం చేస్తున్నదని ఆ పక్షి జాతిని అంతం చేసేందుకు రైతులు ఎందుకు ప్రయత్నాలు చేశారు? మళ్లీ ఇప్పుడెందుకు ఆ జాతిని పరిరక్షిస్తున్నారు.

Advertisement

Sarus Crane |ఈ భూమ్మీద ఎన్నో రకాల జీవులు ఉంటాయి. మనకు కనిపించేవే కాదు.. మనకు కనిపించని కొన్ని వేల, లక్షల జీవులు అడవుల్లో ఉంటాయి. అందులో కొన్ని అరుదైన జాతికి చెందినవి కూడా ఉంటాయి. కొన్ని జీవులు ఉంటేనే బయో డైవర్సిటీ సరిగ్గా ఉంటుంది. ఏ ఒక్కటి మిస్ అయినా జీవవైవిధ్యం దెబ్బ తింటుంది. అది పర్యావరణానికి హాని చేస్తుంది. అందుకే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రైతులు ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన సారస్ క్రేన్ అనే కొంగ జాతి పరిరక్షణకు నడుం బిగించారు. అది ప్రపంచంలోనే ఆకాశంలో ఎగిరే పొడవైన పక్షి.

ఒకప్పుడు ఈ కొంగలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంట వేసినా దాన్ని నాశనం చేసేవి. దీంతో ఆ కొంగ జాతిని నాశనం చేసేందుకు అక్కడి రైతులు చాలా ప్రయత్నాలు చేశారు. నిజానికి ఆ పంటలను నాశనం చేయడం పక్షి తప్పు కాదు. ఎందుకంటే.. పక్షి స్వభావమే అటువంటిది. సారస్ క్రేన్ అనేది మామూలుగా మన దగ్గర కనిపించే కొంగ జాతికి చెందిందే కానీ.. ఇదో అరుదైన జాతి. అందుకే దీని ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కో కొంగ 5.8 అడుగుల వరకు పొడవు ఉంటుంది.

Sarus Crane | రాష్ట్ర పక్షిగా గౌరవం

ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వ్యవసాయ భూముల్లో ఎక్కువ శాతం చిత్తడి నేలలే. కొంగలు కూడా చిత్తడి నేలలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాయి. ఒకప్పుడు ఈ జాతి కనుమరుగు అయ్యే పరిస్థితి రావడం వల్ల పంటలకు చాలా సమస్యలు వచ్చాయి. చీడపురుగులు రావడం, ఇతర కీటకాల తాకిడి ఎక్కువవడంతో ఈ జాతి కొంగలను మళ్లీ పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఎందుకంటే.. ఈ జాతి కొంగలకు ముక్కు పొడవుగా ఉండటం, ఇవి పంటలను నాశనం చేసే రకరకాల చీడపురుగులు, కీటకాలను తినేయడం వల్ల పంటలు నాశనం కాకుండా పరోక్షంగా ఇవి కాపాడగలుగుతాయి.

అలాగే వీటి ముక్కు పొడవుగా ఉండటం వల్ల అవి ముక్కుతో నేలను మొత్తం పురుగుల కోసం తవ్వుతాయి. దాని వల్ల నేల లోపల ఉన్న సారవంతమైన మట్టి పైకి రావడం వల్ల అది పంటలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కొంగ వల్ల రైతులకు చాలా మేలు ఉంటుందని వ్యవసాయ అధికారులు రాష్ట్ర రైతులకు తెలియజేయడంతో పాటు ఆ కొంగ ను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం ప్రకటించడంతో ఆ జాతిని కాపాడేందుకు రైతులు కూడా నడుం బిగించారు.

ఎక్కడ ఆ పక్షి గుడ్లు, గూడు కనిపించినా వాటిని నాశనం చేయకుండా వాటిని అక్కడి రైతులు కాపాడుకుంటూ వస్తున్నారు. దీంతో వాటి జాతి నెమ్మదిగా పెరుగుతోంది. ఈ పక్షి జాతి పరిరక్షణ కోసం సారస్ హాబిటాట్ సెక్యూర్‌మెంట్ ప్రాజెక్ట్ పేరుతో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో వాటి మనుగడ కోసం కృషి చేస్తున్నారు.

(Photos Credit - TheBetterIndia)

Advertisement

తాజావార్తలు

Advertisement