త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | రెండో పంట‌కు చుక్క నీరు కూడా ఇవ్వ‌లేం : మంత్రి జూప‌ల్లి

Jupally Krishna Rao | క‌రువు ప‌రిస్థితుల వ‌ల్ల కాలువ‌ల కింద రెండో పంట వేయొద్ద‌ని రైతుల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచించారు. కాలువల నుంచి ఒక్క చుక్క నీరు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Nov 17, 2026, 1.02 pm IST

Jupally Krishna Rao | రెండో పంట‌కు చుక్క నీరు కూడా ఇవ్వ‌లేం : మంత్రి జూప‌ల్లి
Advertisement

Jupally Krishna Rao | త్రినేత్ర న్యూస్ : క‌రువు ప‌రిస్థితుల వ‌ల్ల కాలువ‌ల కింద రెండో పంట వేయొద్ద‌ని రైతుల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచించారు. కాలువల నుంచి ఒక్క చుక్క నీరు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. సోమ‌వారం కొల్లాపూర్ పట్టణంలో పలువురు లబ్ధిదారులకు కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి జూప‌ల్లి అందజేశారు.

ఈ సంద‌ర్భంగా జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం. కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాలువల కింద రెండో పంట వేయకండి. బావులు ఉంటే పంట వేస్తే ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోండి అని మంత్రి సూచించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా నియంతృత్వ పోకడలు కొనసాగాయని జూప‌ల్లి కృష్ణారావు ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement