త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | స‌న్నాల‌కు బోన‌స్ ఇవ్వ‌డం లేదు..

Harish Rao | ప్ర‌భుత్వం మాట విని రైతులు స‌న్నాలు సాగు చేసినందుకు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. స‌న్నాలు సాగు చేస్తే బోన‌స్ ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు దాన్ని ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Nov 17, 2026, 3.52 pm IST

Harish Rao | స‌న్నాల‌కు బోన‌స్ ఇవ్వ‌డం లేదు..
Advertisement

రైతులు తీవ్రంగా న్ట‌పోతున్నారు
దొడ్డు వ‌డ్లు కొనే దిక్కు లేదు
ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట ఎండిపోయింది
ఎక‌రాకు రూ. 10 వేలు స‌హాయం అందించాలి
ప్ర‌భుత్వానికి మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్

Harish Rao | త్రినేత్ర న్యూస్ : ప్ర‌భుత్వం మాట విని రైతులు స‌న్నాలు సాగు చేసినందుకు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. స‌న్నాలు సాగు చేస్తే బోన‌స్ ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు దాన్ని ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో.. అనేక జిల్లాల్లో ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు రూ. 2600కే క్వింటాల్ వ‌డ్ల‌ను అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని రైతులు అంటున్నార‌ని మాజీ మంత్రి తెలిపారు. ఇక దొడ్డు వ‌డ్లు కొనే దిక్కు లేదు.. క్వింటాల్‌కు ప‌ది కిలోలు త‌రుగు పెడుతున్నార‌ని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేటలో వరి ధాన్యం కొనుగోలుపై రైతులతో హ‌రీశ్‌రావు మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు. నిజాంపేట్ మండల కేంద్రంలో రైతులను కలిసినప్పుడు ఇంతవరకు ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయలేదు. కొబ్బరి కాయలు కొట్టారు కానీ గింజ కూడా కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం కొనపోవడంతో దళారులు ఇష్టం ఉన్నట్లు కొంటున్నారు. రైతుకు బోనస్ విషయంలో జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

లక్షల ఎకరాలు పంట ఎండింది.. ఇప్పటివరకు లెక్కలు తీయలేదు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 5000లు సహాయం చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. నాడు కేసీఆర్ పంటలు నష్టపోతే ఎకరాకు రూ. 10వేలు ఇచ్చారు. నీవు కూడా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

ప్రత్యామ్నాయం ఆలోచన చేసి నీళ్లు ఎత్తిపోయండి. నల్ల వాగులో నీళ్లు ఉన్నాయి.. నిజాం సాగర్‌లో నీళ్ళు ఉన్నాయి నీళ్ళు నింపండి. ప్రజలకు తాగు నీళ్లు ఇవ్వండి. నారాయ‌ణ‌ఖేడ్‌, మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాల నుంచి వ‌ల‌స‌లు పోతున్నారు. ఖేడ్‌లో రైతులు చ‌నిపోయారు.. వారికి రైతు బీమా అంద‌లేదు. ఇప్పటివరకు 3వేల మంది రైతులు చనిపోయారు వారిని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement