Deepinder Goyal | జొమాటో ఫౌండర్ తలకు విచిత్ర పరికరం.. దాన్ని చూసి నెటిజన్లు షాక్
ఈ పరికరం గురించి దీపిందర్ ముందే చెప్పినా.. దాని పూర్తి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఆయన ఈ పరికరాన్ని పెట్టుకొని కనిపించడంతో మరోసారి ఈ టెంపుల్ డివైజ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Viral news | Published On Jan 5, 2026, 7.24 pm IST
Deepinder Goyal | జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ తెలుసు కదా. ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. దానికి కారణం జొమాటో కాదు.. ఆయన తలకు పెట్టుకున్న ఒక విచిత్ర పరికరం.. అది చూడటానికి చాలా చిన్నగానే ఉంది కానీ.. ఓ పాడ్ కాస్ట్‌కి అటెండ్ అయిన దీపిందర్ ఆ సమయంలో దాన్ని పెట్టుకోవడం, ఆ ఫోటోలు వైరల్ అవడం క్షణాల్లో జరిగిపోయాయి.
శనగ గింజంత సైజుల్లో ఉన్న చిన్న గ్యాడ్జెట్ అది. తన ఎడమ కంటికి, చెవికి మధ్య భాగంలో దాన్ని పెట్టుకున్నాడు. అసలు అది ఏంటి? దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? అంటూ నెటిజన్లే ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఊహించుకుంటున్నారు. అది చూయింగ్ గమ్ కావచ్చు, కాదు కాదు ఎక్స్‌టర్నల్ ఎస్ఎస్‌డీ అంటూ మరికొందరు.. ఇలా ఆ డివైజ్‌పై కుళ్లు జోక్స్ పేల్చుతున్నారు.
దాని పేరు టెంపుల్
ఆ డివైజ్ పేరు టెంపుల్. అది బ్రెయిన్‌లో బ్లడ్ ఫ్లోను ట్రాక్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్‌లో రక్త ప్రవాహం అనేది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. అలా ఉంటేనే న్యూరో హెల్త్ బాగుంటుంది. అలాగే మతిమరుపు సమస్య రాదు. మనకు వయసు పెరుగుతున్నా కొద్దీ బ్రెయిన్‌లో జరుగుతున్న మార్పులను ఈ డివైజ్ ఇట్టే పసిగడుతుంది. దీపిందర్ ఎప్పటి నుంచి ఈ డివైజ్‌ని వాడుతున్నాడో తెలియదు కానీ.. రాజ్ షమాని పాడ్‌కాస్ట్‌లో అందరికీ దాని గురించి తెలిసింది.

ప్రయోగాత్మక దశలో టెంపుల్
మీకు ఇంకో విషయం తెలుసా? ఆ టెంపుల్ డివైజ్‌ని తయారు చేసింది ఎవరో కాదు.. దీపిందర్ టీమ్. ఆయన సొంతంగా రీసెర్చ్ చేసి మరీ టీమ్‌ను పెట్టి తన సొంత డబ్బులు రూ.225 కోట్లు పెట్టి ఈ డివైజ్‌ని తయారు చేయించాడట. అది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. అందుకే దాన్ని పెట్టుకొని అలా తిరుగుతున్నాడన్నమాట. ఇది గ్రావిటీ ఏజింగ్ హైపోతెసిస్ అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి పని చేస్తుందని దీపిందర్ టీమ్ చెబుతోంది. వయసు పెరుగుదల, బ్రెయిన్ పని తీరు, బ్రెయిన్‌లో బ్లడ్ సర్కులేషన్ లాంటివి దీర్ఘకాలంలో మనిషి ఆరోగ్యం, ఆలోచనల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోవడమే ఈ పరికరం పని అన్నమాట. అలాగే బ్రెయిన్‌లో యాక్టివ్‌గా పని చేసే సెరెబ్రల్ ఆరోగ్యం ఎలా ఉందో కూడా ఈ పరికరం తెలియజేస్తుంది.
ఈ పరికరం గురించి దీపిందర్ ముందే చెప్పినా.. దాని పూర్తి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఆయన ఈ పరికరాన్ని పెట్టుకొని కనిపించడంతో మరోసారి ఈ టెంపుల్ డివైజ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
I did not explain the Gravity Aging Hypothesis (GAH) well, the first time.
I brought my consumer internet brain into a deep scientific field and I miscommunicated. I tried to compress years of research and thinking into a dramatic social media reveal.
That made the hypothesis… pic.twitter.com/I4dq0XkTPg
— Deepinder Goyal (@deepigoyal) November 20, 2025
తాజావార్తలు
- ●Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్
- ●TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు
- ●Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..
- ●Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
- ●CM Revanth Reddy | తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి..

Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్

TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు

Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..

Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..






