త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naa Anveshana | నా అన్వేషణ ‘అన్వేష్’ ఇండియాకి వస్తే చంపేస్తాం..!

మరోవైపు హిందువులపై, హిందూ దేవుళ్లపై అన్వేష్ చేసిన ఆరోపణలతో చాలామంది సోషల్ మీడియాలో అన్వేష్‌ని అన్‌ఫాలో అవుతున్నారు. దీంతో అన్వేష్ తగ్గి అందరికీ క్షమాపణలు చెబుతున్నట్టుగా వరుసగా వీడియోలు చేస్తున్నాడు.

J

Viral news | Published On Dec 30, 2025, 4.30 pm IST

Naa Anveshana | నా అన్వేషణ ‘అన్వేష్’ ఇండియాకి వస్తే చంపేస్తాం..!
Advertisement

Naa Anveshana | నా అన్వేషణ అనే పేరుతో యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఏర్పాటు చేసి ప్రపంచమంతా చుట్టేస్తున్న అన్వేష్ గురించి తెలుగు ప్రజలకు సుపరిచితమే. గత సంవత్సరం బెట్టింగ్ మాఫియాపై తన గొంతును వినిపించి తెలుగు ప్రజలతో శెభాష్ అనిపించుకున్న అన్వేష్ ఇప్పుడు మాత్రం అదే ప్రజలతో ఛీకొట్టించుకుంటున్నాడు. నువ్వు ఇండియా వస్తే చంపేస్తాం అని అంటున్నారు అంటే అన్వేష్ చేసిన తప్పేంటి. ఒక్కసారిగా అన్వేష్ అంటే చచ్చేంత అభిమానాన్ని ప్రదర్శించిన జనాలు ఇప్పుడెందుకు ధ్వేషిస్తున్నారు. పదండి.. ఓసారి డీప్‌గా అనాలిసిస్ చేద్దాం.

అసలేం జరిగిందంటే.. అన్వేష్ అక్కడెక్కడో దేశంలో ఉండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న టాపిక్స్‌పై మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా తెలుగు హీరో శివాజీ ఇష్యూపై కూడా మాట్లాడాడు. అసలు నువ్వు ఎవరు? ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నువ్వు ఏంది చెప్పేది.. నువ్వు ఎవరు చెప్పడానికి? వాళ్లకు సవాలక్ష సమస్యలు ఉంటాయి. అవి నీకు తెలుసా? నువ్వు బట్టలు విప్పుకొని తిరగొచ్చు కానీ.. వాళ్లు మాత్రం నచ్చిన బట్టలు వేసుకోవద్దా అంటూ శివాజీని బండబూతులు తిట్టాడు. అలాగో ఇంకో వీడియోలో వాటర్ మెలోన్, కీర దోశ లను తీసుకొని బూతులు మాట్లాడుతూ ఏదో వివరించాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే గరికపాటిని కూడా తిట్టాడు. అంతటితో ఆగకుండా హిందువుల మీద కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో భారతదేశంలో ఉన్న హిందువులంతా అన్వేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు అసలు హిందువువేనా? విదేశాల్లో తిరుగుతూ క్రిస్టియన్ మతంలోకి మారావా? భారత్‌కి రాకుండా ఎక్కడో తిరుగుతూ హిందువులను, భారతదేశాన్ని అవమానిస్తావా? అంటూ దేశమంతా అన్వేష్‌పై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి.

Naa Anveshana | నేను హిందువు కాదన్నోడు ప్రతి ఒక్కడు చస్తాడు

నన్ను మతం మార్చేస్తున్నారు. నేను 24 గంటలు వినాయకుడి బొమ్మ, భగవద్గీత పెట్టుకొని తిరుగుతుంటా. నన్ను హిందువు కాదని నా మీద ముద్ర వేస్తున్నారు. నేను సీతమ్మను ఏదో అన్నానని అంటున్నారు. నా మీద అభాండాలు వేసే వారు చస్తారు. నేనే పాపం చేస్తే నేనే చస్తాను. లేదంటే అబద్ధం ఆడేవాళ్లకు ఏదో ఒకటి అవుతుంది.. అంటూ అన్వేష్ మళ్లీ రెచ్చిపోయాడు.

హిందూ సంఘాలకు, గరికపాటికి, శివాజికి, సీతమ్మకు, ద్రౌపదికి.. అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని అన్వేష్ మరో వీడియో పెట్టినా కూడా ఒరేయ్.. నువ్వు ముందు ఇండియాకి రా.. నీకు ఉంటది.. నువ్వు ఇండియా వస్తే నువ్వు బతకవు అంటూ అన్వేష్‌ను బెదిరిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు హిందువులపై, హిందూ దేవుళ్లపై అన్వేష్ చేసిన ఆరోపణలతో చాలామంది సోషల్ మీడియాలో అన్వేష్‌ని అన్‌ఫాలో అవుతున్నారు. దీంతో అన్వేష్ తగ్గి అందరికీ క్షమాపణలు చెబుతున్నట్టుగా వరుసగా వీడియోలు చేస్తున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement