త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Retro Trend | వైరల్‌ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు త‌ప్ప‌దు!

AI Retro Trend | సోషల్‌ మీడియాలో ప్రస్తుతం 80, 90ల నాటి రెట్రో లుక్‌లో ఫొటోలు ట్రెండ్‌గా మారాయి. ఏఐ టూల్స్ స‌హాయంతో పాతకాలంలోకి వెళ్లిపోతున్నారు. కొందరు పాత సినిమాలు, కాలేజీ క్యాంపస్‌లు, స్కూల్‌ ఇయర్‌బుక్‌లు, పాత నగర వీధుల తరహాలోనూ ఫొటోల‌ను త‌యారు చేస్తున్నారు.

P

Telangana | Published On Sep 11, 2026, 6.55 pm IST

AI Retro Trend | వైరల్‌ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు త‌ప్ప‌దు!
Advertisement

AI Retro Trend | సోషల్‌ మీడియాలో ప్రస్తుతం 80, 90ల నాటి రెట్రో లుక్‌లో ఫొటోలు ట్రెండ్‌గా మారాయి. ఏఐ టూల్స్ స‌హాయంతో పాతకాలంలోకి వెళ్లిపోతున్నారు. కొందరు పాత సినిమాలు, కాలేజీ క్యాంపస్‌లు, స్కూల్‌ ఇయర్‌బుక్‌లు, పాత నగర వీధుల తరహాలోనూ ఫొటోల‌ను త‌యారు చేస్తున్నారు. ఈ రెట్రో ఏఐ ట్రెండ్‌లో కేవలం వింటేజ్‌ ఫిల్టర్‌ వేయడం కాకుండా.. అసలు ఫొటోలోని వ్యక్తి దుస్తులు, హెయిర్‌స్టైల్‌, లైటింగ్‌, పరిసరాలను పూర్తిగా మార్చేస్తోంది. ఫొటోతోపాటు 80, 90ల నాటి లుక్‌, దుస్తులు, వాతావరణం, మూడ్‌ గురించి సూచనలు ఇస్తే అందుకు అనుగుణంగా కొత్త ఫొటోల‌ను రూపొందించి ఇస్తుంది. ఫలితాలు సహజంగా కనిపించడంతో అసలు ఫొటోనా.. ఏఐతో రూపొందించిందా అనేది గుర్తించడం కూడా కొన్నిసార్లు క‌ష్టంగానే ఉంటోంది.

ఫొటో అప్‌లోడ్‌ చేసే ముందు జాగ్రత్త

వైరల్‌ ట్రెండ్‌ను ఫాలో అయ్యే క్రమంలో చాలామంది హై-రిజల్యూషన్‌ సెల్ఫీలు, వ్యక్తిగత ఫొటోలను ఏఐ టూల్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఫొటోతోపాటు ముఖ వివరాలు, పరిసరాలు, ఇతర గుర్తింపు సమాచారానికి సంబంధించిన అంశాలు కూడా స‌ర్వీసెస్ సర్వర్లకు చేరే అవకాశం ఉంది. ఆ డేటా ఎంతకాలం నిల్వ ఉంటుంది? దేనికోసం ఉపయోగిస్తారు? ఇతర స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌తో పంచుకుంటారా? వంటి విషయాలను ముందుగా తెలుసుకోవాలి. ఏఐ స‌ర్వీస్ ప్రైవసీ పాలసీ, డేటా కంట్రోల్స్‌ను పరిశీలించకుండా వ్యక్తిగత చిత్రాలను అప్‌లోడ్‌ చేయడం సమస్యలకు దారితీసే అవకాశం ఉంద‌ని సైబ‌ర్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కొన్ని సేవల్లో వినియోగదారుల డేటాను ఏఐ మోడ‌ల్స్‌ను మెరుగుపర్చేందుకు ఉపయోగించే అవకాశాలు ఉండగా.. కొన్ని సందర్భాల్లో హ్యూమ‌న్ రివ్యూకు వెళ్లే అవ‌కాశం సైతం ఉంటుంది. అందుకే ఆయా స‌ర్వీసెస్ నిబంధనలను చదివిన తర్వాతే ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం మంచిది.

డీప్‌ఫేక్‌ల ముప్పు

థర్డ్‌పార్టీ ఏఐ స‌ర్వీస్‌కు ఫొటో చేరిన తర్వాత అది ఎంతకాలం స్టోర్ అవుతుంది.. ఎలా ఉపయోగిస్తారు? ఎప్పుడు తొలగిస్తారు అనే విషయాలపై స్పష్టత ఉండాలి. ముఖ్యంగా ఏఐతో రూపొందించిన చిత్రాలను భవిష్యత్‌లో డీప్‌ఫేక్‌లు, నకిలీ ప్రొఫైల్స్‌, అడెంటిటీ దుర్వినియోగానికి ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే వైరల్‌ ట్రెండ్‌ కోసం ఫొటో అప్‌లోడ్‌ చేసే ముందు ప్రైవసీ పాలసీ, డేటా వినియోగ నిబంధనలు, డేటా డిలీట్‌ చేసే అవకాశం వంటి అంశాలను పరిశీలించాలి. అవసరం లేని వ్యక్తిగత లేదా సున్నితమైన ఫొటోలను ఏఐ టూల్స్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడమే మంచిద‌ని సైబ‌ర్ నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి మీరూ ఈ ట్రెండ్‌ను ఫాలోవుతుంటే ముంద‌స్తుగానే జాగ్ర‌త్త‌ప‌డ‌డం మంచిది.

 

Advertisement
Advertisement