త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srisailam Temple Staff | శ్రీశైలం గుడిలో రికార్డు డ్యాన్సులు.. న్యూఇయర్ వేడుకల్లో స్టాఫ్ వల్గర్ డ్యాన్స్

శ్రీశైలం దేవస్థానం కమిటీ కూడా ఈ ఘటనపై స్పందించింది. ఆ స్టాఫ్ మెంబర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వాళ్లపై కేసు కూడా నమోదయిందని.. వల్గర్‌గా డ్యాన్స్ చేసిన ఐదుగురు స్టాఫ్ మెంబర్స్‌ని విధుల నుంచి తొలగించామని మల్లికార్జున అన్నశాస్త్ర చైర్మన్ శ్యామ్ తెలిపారు.

J

Viral news | Published On Jan 6, 2026, 6.36 pm IST

Srisailam Temple Staff | శ్రీశైలం గుడిలో రికార్డు డ్యాన్సులు.. న్యూఇయర్ వేడుకల్లో స్టాఫ్ వల్గర్ డ్యాన్స్
Advertisement

Srisailam Temple Staff | త్రినేత్ర.న్యూస్: శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఆలయం చుట్టు పక్కన కూడా భక్తులు పద్ధతితో ఉంటారు. ఆలయ ప్రాంగణంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాలు శివనామ స్మరణతో మార్మోగుతుంటాయి. కానీ.. డిసెంబర్ 31న మాత్రం ఆలయ పరిసర ప్రాంతాలు సినిమా పాటలతో మార్మోగాయి. శ్రీశైలం గుడిలో అన్నదానం చేసే డిపార్ట్‌మెంట్‌లో పని చేసే స్టాఫ్ మెంబర్స్ ఆలయ పరిసర ప్రాంతంలోనే కొత్త సంవత్సరం వేడుకలు చేసుకున్నారు. డీజే పెట్టి తెలుగు పాటలు పెట్టి కేక్ కట్ చేసి రికార్డు డ్యాన్సులు చేశారు. న్యూఇయర్ వేడుకల్లో వల్గర్ డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేశారు. వాళ్లు చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఒక పవిత్రమైన ప్రాంతంలో ఇలాంటి రికార్డు డ్యాన్సులు చేయడం ఏంటంటూ భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సంస్థ వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం గుళ్లలో, పరిసర ప్రాంతాల్లో అలాంటి డ్యాన్సులు చేయడం నిషిద్ధం. కానీ ఆ రూల్స్‌ని బ్రేక్ చేస్తూ అన్నశాస్త్రలో పని చేసే స్టాఫ్ సభ్యులు మల్లికార్జున అన్నశాస్త్ర భవనంలోనే రికార్డు డ్యాన్సులు చేయడం హిందువుల మనోభావాలను కించపరచడమే అని భక్తులు మండిపడుతున్నారు.

తాజావార్తలు

Advertisement