Viral Video | దొంగతనానికి వెళ్లి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కున్న దొంగ
తన భార్యతో కలిసి ఆదివారం గుడికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లో ఇరుక్కొని కనిపించాడు. తాను దొంగనని.. తనను ఈ కన్నంలో నుంచి బయటికి తీయాలంటూ ఆ ఓనర్‌నే బెదిరించడం స్టార్ట్ చేశాడు.
Viral news | Published On Jan 6, 2026, 4.54 pm IST
Viral Video | ఎరక్కబోయి ఇరుక్కున్నాడు అంటే ఇదే కాబోలు.. ఓ దొంగ దొంగతనం చేయడానికి ఓ ఇంట్లోకి దూరబోయి అడ్డంగా ఇరుక్కున్నాడు. దొంగతనం చేయాలంటే అంత ఈజీ కాదు. అదొక ఆర్ట్. కొందరు దొంగలు ఎంతో సింపుల్‌గా చేసేస్తారు. పక్కన ఇండ్లలో ఉండే వాళ్లకు కూడా తెలియదు. కానీ.. ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి లోపలికి దూరి ఉన్నదంతా ఊడ్చేద్దామనుకొని మనోడే అడ్డంగా ఓనర్‌కి, పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటు చేసుకుంది. సుభాష్ కుమార్ రావత్ అనే వ్యక్తి ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
తన భార్యతో కలిసి ఆదివారం గుడికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లో ఇరుక్కొని కనిపించాడు. తాను దొంగనని.. తనను ఈ కన్నంలో నుంచి బయటికి తీయాలంటూ ఆ ఓనర్‌నే బెదిరించడం స్టార్ట్ చేశాడు. దీంతో ఓనర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఆ దొంగను ఆ కన్నంలో నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దొంగ కన్నంలో ఇరుక్కునే సరికి మనోడితో వచ్చిన మిగితా వాళ్లు పారిపోయారు. వీళ్లంతా కారులో వచ్చి పక్కా ప్లాన్‌తో దొంగతనం చేయాలనుకున్నా కన్నంలో ఈ దొంగ ఇరుక్కోవడంతో అంతా బెడిసికొట్టింది.
चोरी का प्लान फेल!
एग्जॉस्ट फैन में फंसा चोरकोटा में चोरी की कोशिश कर रहा युवक एग्जॉस्ट फैन के छेद में फंस गया. मकान मालिक के शोर मचाने पर पुलिस ने आरोपी को गिरफ्तार किया, जो पुलिस स्टिकर लगी कार से आया था#Kota #rajasthan #viralvideo pic.twitter.com/GFfrc3qQFw
— NDTV India (@ndtvindia) January 6, 2026
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



