Ponnala Lakshmaiah | నల్లమల సాగర్‌పై ఏపీ వాదనలు విచిత్రం : పొన్నాల లక్ష్మయ్య
Ponnala Lakshmaiah | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Ponnala Lakshmaiah | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నిన్న నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలు విచిత్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణకు ఉంది కదా.. ఏపీ సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోకూడదా..? అని ఏపీ తరపు అడ్వకేట్ ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా..? అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.
ఇవాళ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఏవైనా, వివాదాలు ఏవైనా రాజ్యాంగం ఒక్కటే అని పేర్కొన్నారు. ఏ పరిష్కారానికైనా రాజ్యాంగ పరంగా సంస్థలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా ఏర్పాటు అయిన సంస్థలను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. చట్టాలకు అతీతంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై ఏం చేయాలో విభజన చట్టంలో ఉంది. ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రస్తావన విభజన చట్టంలో ఎక్కడ ఉంది..? కేంద్ర ప్రభుత్వం ఎలా కమిటీలు వేస్తుంది. పోలవరం నల్లమల సాగర్‌కు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి లేనపుడు కమిటీలు ఎలా వేస్తారు..? అసలు మీటింగ్‌కే వెళ్లమని చెప్పిన వారు కమిటీకి ఎలా ఒప్పుకుంటారు..? సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కమిటీకి తెలంగాణ సభ్యుల పేర్లు ఎందుకు పంపింది..? కమిటీ వేసుకున్నారు.. కోర్టుకు వచ్చారు అని నిన్న సుప్రీం కోర్టు తెలంగాణను ప్రశ్నించింది అని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.
రాజ్యంగా పరమైన ఇరిగేషన్ సంస్థలు ఉన్నాయి. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ వంటి సంస్థలు ఉన్నాయి. తెలంగాణ రెండు నదుల మధ్యలో ఉంది. ఓ వైపు కృష్ణా, మరో వైపు గోదావరి నది ఉంది. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. సీమాంధ్ర పాలనలో తెలంగాణకు రావల్సిన నీళ్ళు రాలేవు. నీరు రాకుండా కుట్రలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులపై చిల్లర రాజకీయం చేస్తోంది. ఒకవైపు నదీజలాల పంపిణీ కమిటీల ఏర్పాటు చేసుకొని.. మరో వైపు తెలంగాణ ప్రాజెక్టుల పనులు ఆపడం దౌర్భాగ్యం. కేంద్రం ఒత్తిళ్లకు ఈ ప్రభుత్వం తలొగ్గుతోంది. ప్రభుత్వం క్షుణ్ణంగా చట్టాలను చదివి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలి. పాలమూరు ప్రాజెక్ట్‌పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నా. అవగాహన లేకుండా పీపీటీ అసెంబ్లీలో పెట్టారు. కేసీఆర్ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా..? అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదని చిల్లరగా మాటాడుతున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.
ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్యుమెంట్లలోని పేరాగ్రాఫ్ విడిచి పెట్టి తనకు అనుకూలంగా ఉన్న వాటినే చదవడం దారుణం.. ఇదే నా సీఎం సంస్కారం. ముందు కేటీఆర్, హరీష్ రావుల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కేసీఆర్ రాజకీయ జీవితం ముందు ఇపుడున్న సీఎం అనుభవం ఎంత..? కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడటం సిగ్గు చేటు. ఇరిగేషన్‌పై ప్రభుత్వం తీరు చాలా బాధిస్తుంది. చట్ట సభలు చట్టాలు చేయడానికి ఉన్నాయి. కానీ పంచాయితీలు పెట్టడానికి కాదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసినా ఇరిగేషన్‌పై ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించరు అని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



