త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Tendulkar | గోవాలో ఫ్రెండ్స్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో సారా టెండుల్కర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తూ రోడ్డు మీద ఫ్రెండ్స్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సారాను చూసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

J

Viral news | Published On Dec 31, 2025, 6.36 pm IST

Sara Tendulkar | గోవాలో ఫ్రెండ్స్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో సారా టెండుల్కర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Advertisement

Sara Tendulkar | సారా టెండుల్కర్ అంటే అందరూ సచిన్ టెండుల్కర్ కూతురు గానే చూస్తున్నారు. కానీ.. తను ఇండిపెండెంట్ అమ్మాయి. తను ఒక ఎంట్రీప్రెన్యూర్. తను సొంతంగా కంపెనీలను నిర్వహిస్తున్నారు. తాజాగా తను గోవాలో తన ఫ్రెండ్స్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కంటపడింది. ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తూ రోడ్డు మీద ఫ్రెండ్స్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సారాను చూసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని పొట్టి డ్రెస్ వేసుకొని కనిపించిన సారాను చూసి నెటిజన్లు భగ్గుమంటున్నారు. నడిరోడ్డు మీద అలా బీర్ బాటిల్ పట్టుకొని వెళ్లడం ఏంటి.. అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం సారాకు మద్దతు ఇస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఫ్రెండ్స్‌తో పాటు ఎంజాయ్ చేసినా తప్పేనా? గోవా అంటేనే అక్కడ మందు ఫేమస్. తన చేతుల్లో బీర్ బాటిల్ ఉన్నంత మాత్రాన తను తాగినట్టేనా? అసలు అది బీర్ బాటిల్ అని ఏంటి ప్రూఫ్ అంటూ తనకు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా సారా టెండుల్కర్ మీద ఈ ఒక్క వీడియోను అడ్డం పెట్టుకొని రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Goan_bro. (@goan_bro_)


Advertisement

తాజావార్తలు

Advertisement