Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
పంజాబ్‌లోని మొహాలీలో దారుణం జరిగింది. పట్టపగలే ఇంటి ముందు నాలుగేళ్ల చిన్నారిని కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. అడ్డుకున్న తాతయ్యపైకి కారు ఎక్కించే యత్నం చేశారు.
Mohali child kidnapping | పంజాబ్ రాష్ట్రం మొహాలీ జిల్లాలోని కురాలి (Kurali) ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ నాలుగేళ్ల చిన్నారిని దుండగులు అత్యంత కిరాతకంగా కిడ్నాప్ (Kidnap) చేశారు. బైక్, కారులో వచ్చిన నలుగురు దుండగులు పక్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
కళ్లెదుటే మనవరాలిని తీసుకెళ్తుంటే..
అప్పుడే చిన్నారిని స్కూటీ మీద ఆమె తాత తీసుకొని రాగా.. ఆ చిన్నారిని టార్గెట్ చేసిన కిడ్నాపర్లు.. ఒక్కసారిగా ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. ఇది గమనించిన ఆ పాప తాతయ్య, నానమ్మ వెంటనే అప్రమత్తమయ్యారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మనవరాలిని కాపాడుకునేందుకు దుండగులతో తీవ్రంగా పోరాడారు.
కారుతో తొక్కించే యత్నం
కారును ఆపేందుకు ఆ వృద్ధ దంపతులు వాహనానికి అడ్డంగా నిలబడ్డారు. అయినా ఏమాత్రం కనికరం లేని ఆ దుర్మార్గులు.. వారిని కారుతో గుద్ది, తొక్కించేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ కిడ్నాప్ ఉదంతం మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.
ప్రస్తుతం ఈ కిడ్నాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పసిబిడ్డను అలా ఎత్తుకెళ్లడం చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. ఆ నలుగురు కిడ్నాపర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
🚨SHOCKING | Child kidnapped from outside her house by four men on bike and in car while the family tried to protect her pic.twitter.com/CqA3aWv6HX
— The Tatva (@thetatvaindia) May 20, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026

Viral Video | బార్లో మద్యం మత్తులో యువతిని అక్కడ పట్టుకున్న ఆకతాయి.. పక్కనే ఉన్న భర్త ఏం చేశాడంటే?
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



