Mark Zuckerberg Yacht | 2700 కోట్లు పెట్టి లగ్జరీ నౌక కొని చిక్కుల్లో పడ్డ ఫేస్‌బుక్ సీఈవో
ఈ నౌకను ఫెడ్ షిప్ అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో 4 ఎంటీఎల్ డీజిల్ ఇంజన్లు ఉంటాయి. ఈ నౌక 21 నాట్స్ దూరం వెళ్లగలదు. కనీసం 6 వేల నాటికల్ మైల్స్ ట్రావెల్ చేయగలదు. దీనికి సపోర్ట్‌గా ఒక బోటు, వింగ్ మ్యాన్, అన్ని రకాల సేఫ్టీ టూల్స్ ఉంటాయి.
Viral news | Published On Dec 10, 2025, 6.34 pm IST
Mark Zuckerberg Yacht | డబ్బు సంపాదించడం తేలికో కాదో తెలియదు కానీ.. ఉన్న డబ్బును ఖర్చుపెట్టడం.. అది కూడా విలాసాల కోసం మాత్రం తేలికే. వందలు, వేల కోట్ల డబ్బులు ఉండటం కాదు.. వాటిని ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించుకున్న ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఓ లగ్జరీ నౌకను కొని చిక్కుల్లో పడ్డాడు.
ఏకంగా 2700 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన నౌకను కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలను చూసిన నెటిజన్లు..మార్క్‌ను ఏకిపారేస్తున్నారు.
అసలు.. ఆయనపై నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారో తెలియాలంటే ముందు ఆ లగ్జరీ నౌక గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఈ నౌకను ఫెడ్ షిప్ అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో 4 ఎంటీఎల్ డీజిల్ ఇంజన్లు ఉంటాయి. ఈ నౌక 21 నాట్స్ దూరం వెళ్లగలదు. కనీసం 6 వేల నాటికల్ మైల్స్ ట్రావెల్ చేయగలదు. దీనికి సపోర్ట్‌గా ఒక బోటు, వింగ్ మ్యాన్, అన్ని రకాల సేఫ్టీ టూల్స్ ఉంటాయి.
అంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఇంజిన్లు వదిలే ఉద్గారాల వల్లనే అసలు సమస్య. 4 ఇంజిన్లు అంటే ఎక్కువ శాతంలో బయటికి కాలుష్య కారకాలు విడుదల అవుతాయి. దాని వల్ల పర్యావరణానికి చాలా సమస్య అవుతుంది. క్లైమేట్ చేంజ్ గురించి ఎప్పుడూ మాట్లాడే మార్క్ జుకర్‌బర్గ్ చేసే పని ఇదేనా. పర్యావరణానికి హాని చేసే ఇంత విలాసవంతమైన నౌక అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్ జీరో అనేది కేవలం సాధారణ మనుషులకే. ధనవంతులకు ఇది వర్తించదా? వాళ్లు మాత్రం పర్యావరణానికి హాని చేస్తారా? వాళ్లకు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? అంటూ మార్క్‌పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
“Net zero for thee, but not for me.”
— Edward Suarez (@EdwardMSuarez) December 8, 2025
https://www.youtube.com/watch?v=4ePXYtks5gY
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Meta Layoffs | మెటాలో మొదలైన లేఆఫ్స్.. ఉదయం 4 గంటలకే మెయిల్స్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



