Viral Video | కొడుకు బర్త్‌డే సెలబ్రేట్ చేయడం కోసం రోడ్డు బ్లాక్ చేసి రచ్చ
ఆ వీడియోపై స్పందించిన దీపక్.. నేను సెలబ్రిటీని. ఒక ఐదు నిమిషాలు వాహనాలను అపితే అది పెద్ద నేరమా? నేను ఏ నేరం చేశాను? అంటూ మాట్లాడటంతో ఆ వ్యాపారవేత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు, నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.
Viral news | Published On Dec 24, 2025, 5.25 pm IST
Viral Video | ఓ బిజినెస్‌మ్యాన్ కళ్లు నెత్తికెక్కి, డబ్బు ఉంది అన్న అహంకారంతో తన కొడుకు బర్త్‌డే సెలబ్రేట్ చేయడం కోసం రోడ్డు మీదికి వచ్చి వాహనాలను ఆపి రచ్చ చేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో చోటు చేసుకుంది. సూరత్‌కి దగ్గర్లో ఉన్న దుమాస్ రోడ్ చాలా బిజీగా ఉంటుంది. అటువంటి రోడ్డుపై సడెన్‌గా దీపక్ ఐజర్దార్ అనే వ్యాపారవేత్త తన కొడుకు పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసేందుకు రోడ్డు మీదికి వచ్చాడు. రోడ్డును బ్లాక్ చేసి వాహనాలను ఆపేశాడు. ఆయన వెంటనే బాడీగార్డ్స్, పలువురు వ్యక్తులు వచ్చారు.
ఫైర్ క్రాకర్స్ చేతుల్లో పట్టుకొని వాటిని గాలిలో పేల్చుతూ ఎంజాయ్ చేశాడు. ఆయన ఫైర్ క్రాకర్స్ పేల్చుతున్నంత సేపు వాహనాలను ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. ఓ కారు డ్రైవర్ హారన్ కొట్టడంతో ఆ వ్యాపారవేత్త ఆ డ్రైవర్‌ని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు పబ్లిక్ రోడ్ సేఫ్టీపై సర్వత్త్రా భయాందోళన వ్యక్తం అవుతోంది.
ఆ వీడియోపై స్పందించిన దీపక్.. నేను సెలబ్రిటీని. ఒక ఐదు నిమిషాలు వాహనాలను అపితే అది పెద్ద నేరమా? నేను ఏ నేరం చేశాను? అంటూ మాట్లాడటంతో ఆ వ్యాపారవేత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు, నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.
తాజావార్తలు
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!
- ●Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
- ●Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!

Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి

TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!






