త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | రాంగ్ రూట్‌లో వచ్చాడని మెర్సిడిస్ కారు అద్దాలను పగులగొట్టి రచ్చ

మెర్సిడిస్ కారు రోడ్డుకి రాంగ్ సైడ్ వచ్చింది. దీంతో సైబర్ పార్క్ సెక్యూరిటీ గార్డ్ కారును వెనక్కి తీసుకెళ్లాలని డ్రైవర్‌కి చెప్పారు. దీంతో కారు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

J

Viral news | Published On Dec 19, 2025, 3.42 pm IST

Viral Video | రాంగ్ రూట్‌లో వచ్చాడని మెర్సిడిస్ కారు అద్దాలను పగులగొట్టి రచ్చ
Advertisement

Viral Video | క్షణికావేశం ఎంత పని చేస్తుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. రాంగ్ రూట్‌లో వచ్చాడని, తమతో గొడవ పడ్డాడని సెక్యూరిటీ సిబ్బంది రాంగ్ రూట్‌లో వచ్చిన మెర్సిడిస్ బెంజ్ కారుపై కర్రలతో విరుచుకుపడ్డారు. కారు డోర్ల అద్దాలు, ముందు అద్దాన్ని పగులగొట్టి కారును ధ్వంసం చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని సెక్టార్ 31లో ఉన్న సైబర్ పార్క్‌లో చోటు చేసుకుంది.

మెర్సిడిస్ కారు రోడ్డుకి రాంగ్ సైడ్ వచ్చింది. దీంతో సైబర్ పార్క్ సెక్యూరిటీ గార్డ్ కారును వెనక్కి తీసుకెళ్లాలని డ్రైవర్‌కి చెప్పారు. దీంతో కారు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సెక్యూరిటీ స్టాఫ్ అంతా కలిసి వచ్చి ఆ కారును ధ్వంసం చేశారు. ఆ కారును ధ్వంసం చేయడంతో రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని ఆ కారు డ్రైవర్ వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement