Bengaluru Family Attempts to Courier Man | ఇన్‌స్టా రీల్ కోసం కన్నతండ్రిని గోనె సంచిలో వేసి కోరియర్ చేయిబోయిన యువతి
ఉగాది, రంజాన్ లాంటి పండుగల నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతున్నారు.. బస్సులు లేవు.. రైళ్లు లేవు.. ప్రయాణాలు ఎలా చేయాలి? అందుకే అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రాంక్ వీడియో చేశామంటూ మరో బాంబు పేల్చారు.
Viral news | Published On Mar 18, 2026, 4.46 pm IST
Bengaluru Family Attempts to Courier Man | సోషల్ మీడియా పిచ్చి నేటి జెన్ జెడ్‌లో రోజురోజుకీ విపరీతం అవుతోంది. వాళ్లతో పాటు పెద్ద వాళ్లు కూడా సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. పిల్లలకు చెప్పాల్సిన పెద్దలు కూడా వీటికి బానిసలవ్వడం వల్ల ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. నిన్ననే ఓ యువకుడు గన్‌తో ఇన్‌స్టా రీల్ చేస్తూ ప్రమాదవశాత్తు అది పేలడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా బెంగళూరులో ఓ యువతి తన కన్నతండ్రినే గోనె సంచిలో వేసి మూట కట్టి కోరియర్ చేయబోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరులోని వ్యాలికావల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఫ్యామిలీ అక్కడే ఉన్న లోకల్ కోరియర్ సర్వీస్ ఆఫీసులోకి పెద్ద గోనె సంచిని తీసుకొని వెళ్లారు. ఐదుగురు వ్యక్తులు ఆ సంచిని కష్టపడుతూ మోసుకెళ్లి దాన్ని కోరియర్ చేయాలన్నారు. ఆ సంచిలో ఏదో కదులుతున్నట్టుగా ఆఫీసు సిబ్బందికి అనిపించి అందులో ఏముందో ఓపెన్ చేయాలన్నారు. ఆ సంచిని ఓపెన్ చేయగానే అందులో నుంచి ఓ ముసలాయన బయటికి రావడంతో కోరియర్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. అయినా కూడా అతడిని కోరియర్ చేయాలంటూ ఆ ఫ్యామిలీ పట్టుబట్టింది. కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం. ఎలాగైనా ఆయన్ను సంచిలో కోరియర్ చేయాలంటూ కోరడంతో వెంటనే కోరియర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి నుంచి వాళ్లు ఉడాయించారు.
సోషల్ మీడియా రీల్ కోసమే ఇదంతా
కోరియర్ సెంటర్‌లో ఉన్న సీసీటీవీ వీడియో వైరల్ కావడంతో ఇదంతా సోషల్ మీడియా రీల్ కోసమే చేశామని, అలాగే ఉగాది, రంజాన్ లాంటి పండుగల నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతున్నారు.. బస్సులు లేవు.. రైళ్లు లేవు.. ప్రయాణాలు ఎలా చేయాలి? అందుకే అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రాంక్ వీడియో చేశామంటూ మరో బాంబు పేల్చారు. పోలీసులు కూడా కలగజేసుకొని ఇలాంటి పిచ్చి ప్రాంక్స్ ఇంకోసారి చేయొద్దంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఆ ఫ్యామిలీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వీళ్ల వింత ఆలోచన మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కూడా నోరెళ్లబెడుతున్నారు.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



