Viral Video | “మర్యాదగా మాట్లాడు” అన్నందుకు రోగిని చితకబాదిన డాక్టర్
ఈ ఘటనతో ఆసుపత్రి ఎదుట రోగి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Viral news | Published On Dec 23, 2025, 11.25 am IST
Viral Video | ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే ఓ రోగిపై వీధి రౌడిలా విరుచుకుపడ్డాడు. తనను తు అంటూ ఏకవచనంతో పిలవొద్దని.. మర్యాదగా మాట్లాడండి అని రోగి అన్నందుకు ఆ రోగిని డాక్టర్ చితకబాదాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని ఐజీఎంసీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్జున్ పన్వార్ అనే రోగి సోమవారం వైద్య పరీక్షల కోసం ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్లాడు. అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఓ వార్డులోని బెడ్‌పై పడుకున్నాడు. అక్కడికి వచ్చిన డాక్టర్ “నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు” అంటూ ఏకవచనంతో మాట్లాడాడు. దీంతో “నన్ను గౌరవంగా పిలవండి” అంటూ అర్జున్ కోరాడు. అయినా డాక్టర్ వినకుండా నువ్వు అంటే నువ్వే అంటూ ఇంకా ఆ రోగిని హేళన చేశాడు. దీంతో మీ ఇంట్లో వాళ్లతో మీరు ఇలాగే మాట్లాడుతారా? అంటూ ఆ రోగి.. డాక్టర్‌ను ప్రశ్నించడంతో క్షణికావేశానికి లోనైన డాక్టర్.. ఆ రోగిపై దాడికి తెగబడ్డాడు.
Viral Video | రణరంగంలా మారిన ఆసుపత్రి
బెడ్‌పై పడుకొని ఉన్న రోగిపై ఆ డాక్టర్ పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పదే పదే ముఖంపై చేతులతో కొట్టాడు. ఆ రోగి కూడా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా రోగికి గాయాలయ్యాయి. రోగిపై డాక్టర్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనతో ఆసుపత్రి ఎదుట రోగి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ డాక్టర్‌పై రోగి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(Video Courtesy - ThePrint)
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



