త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dancing Cop | ఆ ట్రాఫిక్ పోలీస్‌‌కి డిమోషన్.. ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో..

ఈ పోలీస్ ఎక్కువగా మూన్‌వాకింగ్‌తో ఫేమస్ అయ్యాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మూన్ వాకింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేసే ఈ పోలీస్ ఇప్పుడు ఓ మహిళ ఫిర్యాదు వల్ల డిమోషన్ కావాల్సి వచ్చింది.

J

Viral news | Published On Jan 31, 2026, 4.07 pm IST

Dancing Cop | ఆ ట్రాఫిక్ పోలీస్‌‌కి డిమోషన్.. ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో..
Advertisement

Dancing Cop | మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి తెలిసే ఉంటుంది. ఆయన వృత్తి రీత్యా ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేసే రాజ్‌నీత్ సింగ్‌కి డ్యాన్సింగ్ కాప్‌గా పేరు. ఎందుకంటే సిగ్నల్స్ వద్ద డ్యూటీ చేస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తాడు. అందుకే ఆయనకు డ్యాన్సింగ్ కాప్ అనే పేరు వచ్చింది. ఆయన ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ డ్యాన్స్ చేసిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు రాజ్‌నీత్. ఆ తర్వాత మనోడికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో కానిస్టేబుల్‌గా ఉన్న రాజ్‌నీత్ కాస్త హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు. ప్రమోషన్ వచ్చింది. ఫేమ్ వచ్చింది. కాలం కూడా గిర్రున తిరిగింది. చివరకు ఓ మహిళతో అనుచిత ప్రవర్తన కారణంగా మళ్లీ డిమోషన్ వచ్చింది.

మూన్‌వాకింగ్ స్టైల్‌తో ఫేమస్

ఈ పోలీస్ ఎక్కువగా మూన్‌వాకింగ్‌తో ఫేమస్ అయ్యాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మూన్ వాకింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేసే ఈ పోలీస్ ఇప్పుడు ఓ మహిళ ఫిర్యాదు వల్ల డిమోషన్ కావాల్సి వచ్చింది. ముంబైకి చెందిన ఓ మహిళతో అభ్యంతరకరంగా చాట్ చేశాడని, తనను ఇండోర్ రావాలంటూ ఒత్తిడి చేశాడని, ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ డ్యాన్సింగ్ కాప్‌ని పోలీసు ఉన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్‌గా చేశారు.

 

View this post on Instagram

 

A post shared by The Times of India (@timesofindia)

Advertisement

తాజావార్తలు

Advertisement