త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhupesh Baghel vs Bageshwar Baba | బాబా బాగేశ్వర్.. బీజేపీ ఏజెంట్

రాయ్‌పూర్ నుంచి భిలాయ్‌కి బాబా వెళ్లారు. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 29 వరకు అక్కడ ఉన్న జయంతి స్టేడియంలో జరుగుతున్న హనుమంత్ కథ అనే కార్యక్రమంలో బాబా పాల్గొంటారు.

J

Viral news | Published On Dec 27, 2025, 3.33 pm IST

Bhupesh Baghel vs Bageshwar Baba | బాబా బాగేశ్వర్.. బీజేపీ ఏజెంట్
Advertisement

Bhupesh Baghel vs Bageshwar Baba | బాబా బాగేశ్వర్ తెలుసు కదా. మత ప్రభోదకుడిగా ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాడు. నార్త్‌కి చెందిన ఈ బాబా అసలు పేరు ధీరేంద్ర శాస్త్రి. ఈయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ప్రవచనాలు వినడం కోసం లక్షల మంది క్యూ కడుతుంటారు. ఈ బాబా తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో అడుగుపెట్టారో లేదో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ బాబా గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భాగల్ ఆయనపై పలు విమర్శలు చేశారు. బీజేపీ ఏజెంట్‌లా బాబా బాగేశ్వర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు దేవుడి గురించి బాగా తెలుసు. మీరు వచ్చి చెప్పాల్సిన పని లేదు. బీజేపీ కోసమే బాబా పనిచేస్తున్నట్లుగా ఆయన ఆరోపించారు. శివుడు ఎవరో? హనుమాన్ ఎవరో? ప్రజలకు బాగా తెలుసు. వాళ్లకు తెలిసినంతగా మీకు కూడా తెలియదు.. వీళ్లంతా మూఢనమ్మకాలు వ్యాప్తి చేయడానికే ఇక్కడికి వస్తున్నారు.. అని బాబాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భూపేశ్ వ్యాఖ్యలపై బాబా బాగేశ్వర్ కూడా స్పందించారు. తాను రాజకీయ నేతను కాదని.. హిందూ కమ్యూనిటీని ఉత్తేజరపరచడం, చైతన్యపరచడం మూఢనమ్మకాల కిందికి వస్తాయా? అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ మత ప్రచారం కాస్త రాజకీయ రంగు పూసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారింది.

ప్రభుత్వ విమానంలో రావడం ఏంటి?

బాబా బాగేశ్వర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో ఛత్తీస్‌గఢ్‌కి రావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వ విమానంలో రావడం ఏంటి? ఓవైపు ప్రజలు చెమటోడ్చి టాక్సులు కడుతుంటే ప్రభుత్వ ధనాన్ని ఓ మత ప్రచారకుడికి వెచ్చించడం ఏంటి అంటూ ఛత్తీస్‌గఢ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఆయన విమానం దిగిన వెంటనే అక్కడే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి, షూ తీసేసి ఆయన కాళ్లకు నమస్కరించాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ రాష్ట్ర ప్రజలు పోలీసుల తీరుపై కూడా విమర్శిస్తున్నారు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఓ బాబా కాళ్ల మీద పడటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

cop touches baba bageshwar feet in chhattisgarh video viral

మరోవైపు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెందిన విమానంలో రాయ్‌పూర్‌కి చేరుకున్న బాబాకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాయ్‌పూర్ నుంచి భిలాయ్‌కి బాబా వెళ్లారు. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 29 వరకు అక్కడ ఉన్న జయంతి స్టేడియంలో జరుగుతున్న హనుమంత్ కథ అనే కార్యక్రమంలో బాబా పాల్గొంటారు.

ఆ పోలీసు యూనిఫాంలో లేడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాల్ ఉమెద్.. ఆ పోలీస్ ఆఫీసర్ పూర్తిగా యూనిఫామ్‌లో లేడని తెలిపారు. వీడియో రికార్డు చేసే సమయంలోనే అప్పటికే ఆయన షూ, క్యాప్ తీసేయడం వల్ల యూనిఫాంలో లేనట్టే అని అర్థం వచ్చేలా ఎస్పీ వ్యాఖ్యానించారు. సర్వీస్ రూల్స్‌ని బ్రేక్ చేసినట్లుగా అక్కడ ఏం లేదని, అందుకే ఆ పోలీస్ ఆఫీసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement