త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్‌ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

బెంగళూరులో నిత్యం నమ్మ మెట్రోలో ప్రయాణించాలంటే కనీసం రూ. 70,000 జీతం ఉండాలనే విశ్లేషణ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

J

Viral news | Published On Sep 22, 2026, 5.04 pm IST

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్‌ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

సంక్షిప్త సారాంశం

15 కిలోమీటర్ల ప్రయాణం, లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఖర్చులను కలుపుకుని నెలకు సుమారు రూ. 3,520 ఖర్చవుతుందని ఒక విశ్లేషణ అంచనా వేసింది. ప్రయాణ ఖర్చు ఆదాయంలో 5% ఉండాలనే ప్రాతిపదికన చూస్తే, దీనికి కనీస నెలవారీ జీతం రూ. 70,400 అవసరమని తేలింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే బెంగళూరులో మెట్రో, రవాణా ఖర్చులు అత్యధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సామాన్యులకు అందుబాటులో ఉండాలని, ఇది ప్రీమియం సర్వీస్‌లా మారుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Namma Metro Daily Commute Cost | త్రినేత్ర.న్యూస్ : బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మెట్రోలో ప్రయాణించడం ఎంత సౌకర్యంగా ఉంటుందో, దాని ఖర్చు కూడా అదే స్థాయిలో భారంగా మారుతోంది. రోజూ మెట్రోలో ప్రయాణించే ఖర్చుపై తాజాగా వెలువడిన ఒక విశ్లేషణ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మెట్రో ప్రయాణాన్ని హాయిగా భరించాలంటే ప్రయాణికులకు ఊహించని స్థాయిలో నెలవారీ ఆదాయం అవసరమవుతుందని ఈ విశ్లేషణ అంచనా వేసింది.

ఖర్చులు, లెక్కలు ఎలా ఉన్నాయి?

ఈ లెక్కలు సాధారణంగా 15 కిలోమీటర్ల వన్‌-వే మెట్రో ప్రయాణం, అలాగే రెండు వైపులా దాదాపు 2 కిలోమీటర్ల లాస్ట్-మైల్ (Last-mile) ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడ్డాయి. నెలలో 22 పని దినాలు ప్రయాణించే వ్యక్తికి మొత్తం ప్రయాణ ఖర్చు సుమారు రూ.3,520 వరకు అవుతుందని అంచనా .

ప్రయాణానికి అయ్యే ఖర్చు టేక్-హోమ్ ఆదాయంలో 5% ఉండాలనే బెంచ్‌మార్క్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ లెక్కన రూ.3,520 ఖర్చును భరించాలంటే సుమారు రూ.70,400 నెలవారీ జీతం అవసరమవుతుందని తేలింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ రూ.70,000 సంపాదించాలనే నియమం కాదని, కేవలం దూరం, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది.

ఇతర నగరాలతో పోలిస్తే

దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే బెంగళూరులో ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సుదూర ప్రయాణానికి సంబంధించి నెలవారీ ఖర్చు ఢిల్లీలో రూ.2,772, చెన్నైలో రూ.2,200, ముంబైలో రూ.1,980, కోల్‌కతాలో రూ.1,760 వరకు ఉంటోందని అంచనా. ముంబై, కోల్‌కతా నగరాల్లో ఏళ్ల తరబడి సబర్బన్ రైల్వే వ్యవస్థ అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణ భారం కొంత తక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్లు

ఈ అంశంపై 'ఎక్స్' వేదికగా పలువురు నెటిజన్లు చేసిన పోస్ట్ వైరల్ అయింది . "నమ్మ మెట్రోలో నిత్య ప్రయాణానికి కనీస జీతం రూ.70,000 అవసరం. అంటే ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రో" అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సామాన్యులకు అందుబాటులో ఉండాల్సింది పోయి ప్రీమియం సర్వీస్‌లా మారుతోందని, ఆటోలు లేదా క్యాబ్‌లతో పోలిస్తే మెట్రో కూడా భారంగా మారుతోందని పెదవి విరుస్తున్నారు.

Advertisement
Advertisement