Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి–సెంగోట్టై, ప్రయాగ్‌రాజ్–చార్లపల్లి మధ్య ఈ ప్రత్యేక సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చర్లపల్లి నుంచి సెంగొట్టై మధ్య 18 రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.
Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి–సెంగోట్టై, ప్రయాగ్‌రాజ్–చార్లపల్లి మధ్య ఈ ప్రత్యేక సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చర్లపల్లి నుంచి సెంగొట్టై మధ్య 18 రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. 07191 చర్లపల్లి–సెంగోట్టై స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. అలాగే, 07192 సెంగోట్టై–చర్లపల్లి ప్రత్యేక రైలు ప్రతి శనివారం అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఆయా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పొల్లాచ్చి, ఉడుమలైపేట, పళని, ఒడ్డంచత్రం, దిండిగల్, మదురై, విరుదునగర్, శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు, రాజపాళయం, శంకరన్‌కోవిల్, కడయనల్లూరు, తెన్‌కాశి స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పింది.
ప్రయాగ్‌రాజ్-చర్లపల్లి మధ్య 20 రైళ్లు
చర్లపల్లి-ప్రయాగ్‌రాజ్-చర్లపల్లి మధ్య 20 రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 04121 నంబరు గల ప్రయాగ్‌రాజ్-చరల్లపల్లి ప్రత్యేక రైలు ప్రత్యేక రైలు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇక 04122 చర్లపల్లి–ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక రైలు మంగళవారాల్లో సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. ఆయా రైళ్లు ఈ రైళ్లు మణిక్పూర్, సత్నా, జబల్‌పూర్, ఇటార్సీ, బేతుల్, పాంధుర్ణా, నాగ్‌పూర్, సేవాగ్రామ్, చంద్రపూర్, బల్హార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయని తెలిపింది. ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు 38 ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని కోరింది.
తాజావార్తలు
- ●Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- ●New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!
- ●TG Weather | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!
- ●Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?
- ●TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..
- ●Visa-Free Countries For Indians 2026 | వీసా టెన్షన్ లేదు.. ప్యాకింగ్ చేసుకొని బయలుదేరడమే! భారత పాస్‌పోర్ట్‌తో 2026లో వీసా లేకుండా వెళ్లగల 7 దేశాలు

Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!

TG Weather | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!

Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?





