త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Pensions | ద‌స‌రాకు ముందే కొత్త పెన్ష‌న్లు..!

New Pensions | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పెన్ష‌న్ల మంజూరుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ దస‌రా పండుగ‌కు ముందే కొత్త పెన్ష‌న్లు మంజూరు చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క సంబంధిత అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు.

S

Telangana | Published On Sep 22, 2026, 4.34 pm IST

New Pensions | ద‌స‌రాకు ముందే కొత్త పెన్ష‌న్లు..!
Advertisement

పెన్ష‌న్ల‌కు పంపిణీకి ఏర్పాట్లు చేయండి
అధికారుల‌కు మంత్రి సీత‌క్క ఆదేశాలు జారీ

New Pensions | త్రినేత్ర న్యూస్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పెన్ష‌న్ల మంజూరుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ దస‌రా పండుగ‌కు ముందే కొత్త పెన్ష‌న్లు మంజూరు చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క సంబంధిత అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. అక్టోబ‌ర్ నెల‌లో దస‌రా పండుగ నేప‌థ్యంలో కొత్త పెన్ష‌న్ల పంపిణీకి ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఈ నేప‌థ్యంలో పెన్ష‌న్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి సీత‌క్క ఆదేశాలు జారీ చేశారు. ద‌స‌రా నాటికి లబ్ధిదారుల చేతికి పెన్షన్లు అందేలా అధికార యంత్రాంగం వేగంగా పనిచేయాలని ఆమె ఆదేశించారు.

ఒంట‌రి మ‌హిళ‌ల‌కు, వితంతువుల‌కు పెద్ద‌పీట‌

కొత్త పెన్ష‌న్ల పంపిణీ సంద‌ర్భంగా.. స‌మాజంలో ఆద‌ర‌ణ‌కు నోచుకోని ఒంట‌రి మ‌హిళ‌లు, వితంతువులకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు సీత‌క్క పేర్కొన్నారు. ఈ వ‌ర్గాల‌కు ఆర్థిక భ‌రోసా క‌ల్పించ‌డ‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. పెన్ష‌న్ల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న వారిలో అర్హులంద‌రికీ మంజూరు చేస్తామ‌న్నారు. అధికారులు కూడా బాధ్యాత‌యుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీత‌క్క సూచించారు.

అదనపు సిబ్బంది నియామకం..

పెన్షన్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండేలా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతను సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు అప్పగించారు. వెరిఫికేషన్‌లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఏర్పడితే, తక్షణమే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఎలాంటి జాప్యానికి తావులేకుండా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement