TG Weather | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. గత ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమదిశగా కదులుతోందని వాతావరణశాఖ పేర్కొంది.
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. గత ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమదిశగా కదులుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఏపీలోని కళింగపట్నానికి తూర్పు- ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరం, ఒడిశాలోని పూరీకి దక్షిణంగా 210 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 290 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. రాబోయే 12 గంటల్లో ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ, పశ్చిమ-మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రి, గురువారం తెల్లవారు జామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అలాగే, ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండంతో అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కర్నాటక, కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.
ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
మంగళవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది. బుధశారం పెద్దపల్లి, భూపాలప్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. అలాగే, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్..
ఇక గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాంతో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని వివరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- ●New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!
- ●Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?
- ●TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..
- ●Visa-Free Countries For Indians 2026 | వీసా టెన్షన్ లేదు.. ప్యాకింగ్ చేసుకొని బయలుదేరడమే! భారత పాస్‌పోర్ట్‌తో 2026లో వీసా లేకుండా వెళ్లగల 7 దేశాలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!

Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?

TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..




