త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pigs | వ‌ర‌ద నీటిలో పందులు విల‌విల‌.. ప్రాణాల‌తో కాపాడిన చైనీయులు..

Pigs | దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఆ ప్రాంత‌మంతా అత‌లాకుత‌ల‌మైంది. భారీగా వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల ధాటికి జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది.

S

Viral news | Published On Jul 12, 2026, 8.11 am IST

Pigs | వ‌ర‌ద నీటిలో పందులు విల‌విల‌.. ప్రాణాల‌తో కాపాడిన చైనీయులు..
Advertisement

Pigs | త్రినేత్ర‌.న్యూస్ : దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఆ ప్రాంత‌మంతా అత‌లాకుత‌ల‌మైంది. భారీగా వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల ధాటికి జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. అంతేకాదు జంతువులు వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయాయి. కోబ్రాలు కూడా కొట్టుకుపోవ‌డంతో వాటిని స్థానికులు ర‌క్షించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పందులు వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతుండ‌గా, వాటిని ప్రాణాల‌తో కాపాడిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

గ్వాంగ్జి ప్రావిన్స్‌లో సంభ‌వించిన వ‌ర‌దల‌కు పందులు వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయాయి. గ‌మ‌నించిన స్థానికులు వాటిని కాపాడుకునేందుకు ఎక్స్‌క‌వేట‌ర్‌ను రంగంలోకి దించారు. వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతున్న పందుల‌ను ప్రాణాల‌తో కాపాడారు. అనంత‌రం వాటిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

మేసాక్ తుపాను జూలై 3వ తేదీన సంభ‌వించ‌గా, నాటి నుంచి వ‌ర్షాలు కుండ‌పోతగా కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. స్కూల్స్ మూత‌ప‌డ్డాయి. ప‌లు ప్రాంతాలు నీటిమ‌యం అయ్యాయి. హోంగ్జూ సిటీలోనే దాదాపు 53 వేల మందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఎమ‌ర్జెన్సీ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తూనే ఉన్నాయి.

Advertisement
Advertisement