త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు జీవిత భాగ‌స్వామితో మంచి స‌మ‌యం గ‌డుపుతారు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

S

Horoscope | Published On Jul 12, 2026, 6.16 am IST

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు జీవిత భాగ‌స్వామితో మంచి స‌మ‌యం గ‌డుపుతారు..!
Advertisement

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం సంతృప్తికరమైన ఫలితాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉంటూ సకాలంలో పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. ఆర్ధిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అపార్ధాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. వారం మధ్యలో ప్రయాణాలకు అనుకూలం.

వృషభం (Taurus) 

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు అందుకునే అవకాశం ఉంది. నూతన మార్గాల ద్వారా ఆదాయం పెరిగే సూచన కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలు స్థిరంగా కొనసాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సహకారంతో చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రయోజనకరంగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులకు ఈ వారం ఏర్పడే నూతన పరిచయాలు భవిష్యత్తులో వ్యాపారాభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు మార్గం అవలంబించడం ఉత్తమం. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి. మోసపూరిత వ్యక్తులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో అస్థిర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా చూసుకోండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. పనికి తగిన ప్రతిఫలం లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తులు, భూమి వంటి ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో అనుమానాలు, వివాదాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీరు సాధించే విజయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగడం వల్ల నష్టాలు తగ్గుతాయి. ఆర్థికంగా ఈ వారం ఆశాజనకంగానే ఉన్నప్పటికీ డబ్బు పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అహాన్ని పక్కనపెట్టి ముందుకు సాగడం మంచిది. కుటుంబంలో ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు జరుగుతాయి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు తమ ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార విస్తరణ పనులు ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో విచక్షణతో అలోచించి నిర్ణయం తీసుకోవాలి. క్షీణించిన ఆర్థిక పరిస్థితి ఒత్తిడి కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో అపార్ధాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తతో నడుచుకోవాలి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అవసరానికి సరిపడా నిధులు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితి ఉంటుంది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరగడంతో పొదుపుపై దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ధనయోగం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు శుభవార్తలు వింటారు.  కీలక పెట్టుబడుల విషయంలో ఆచి తూచి అడుగేయాలి. ఆర్థికంగా, ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుకు అనువైన సమయం. కుటుంబంలో కలహాలు రాకుండా మాటను అదుపులో పెట్టుకోండి. వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ల కారణంగా గృహంలో శాంతి లోపిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలో స్వల్ప ప్రయంత్నంతోనే గణనీయమైన లాభాలు ఆర్జిస్తారు. కొత్త వెంచర్లు, పెట్టుబడులకు మంగళకరమైన సమయం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. ప్రేమ వ్యవహారాలు ఆనందదాయకంగా ఉంటాయి.

కుంభం (Aquarius) 

కుంభ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తించి పదోన్నతులతో సత్కరిస్తారు. వ్యాపారంలో అమ్మకాలు, కొనుగోళ్లు పెరగడంతో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన గృహం, వాహన యోగం ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు క్రమంగా తొలగి శాంతి నెలకొంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. అధికారుల నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను తెలివిగా నిర్వహించుకుంటే సవాళ్లు అధిగమించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో గతంలో ఉన్న సమస్యలు తొలగుతాయి. కుటుంబంలో ఉద్రిక్తపూరిత వాతావరణం ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు అశాంతి కలిగిస్తాయి.

Advertisement
Advertisement