Lion | 11 ఏళ్ల బాలుడిని చంపిన సింహాం.. ఆపై మృగరాజుకు వాంతులు
Lion | కుటుంబ సభ్యులతో కలిసి అంబాజీ ఆలయ దర్శనానికి వెళ్లిన ఓ 11 ఏళ్ల బాలుడిపై సింహాం దాడి చేసి చంపింది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని గిర్నార్ కొండపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
Lion | త్రినేత్ర.న్యూస్ : కుటుంబ సభ్యులతో కలిసి అంబాజీ ఆలయ దర్శనానికి వెళ్లిన ఓ 11 ఏళ్ల బాలుడిపై సింహాం దాడి చేసి చంపింది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని గిర్నార్ కొండపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
గుజరాత్‌లోని గిర్నార్ కొండపై అంబాజీ, దత్తాత్రేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ దేవుళ్ల దర్శనానికి భక్తులు కొండపైకి కాలినడకన వెళ్తుంటారు. అయితే శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మయూర్ చౌహాన్(11) అనే బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి బయల్దేరారు. మార్గమధ్యలో ఓ సింహాం బాలుడిపై దాడి చేసి సమీప అడవుల్లోకి లాక్కెళ్లింది.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు కలిసి పోలీసులు, అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలు చేపట్టగా.. ఘటనాస్థలానికి 100 మీటర్ల దూరంలో బాలుడి శరీర భాగాలు లభ్యమయ్యాయి.
ఆ తర్వాత అటవీశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా, బాలుడిపై దాడి చేసిన సింహాన్ని కనుగొన్నారు. అనంతరం దాంతో పాటు మరో రెండు సింహాలను బంధించారు. అయితే బాలుడిపై దాడి చేసిన సింహం వాంతులు చేసుకుంది. వాంతుల్లో బాలుడి శరీర భాగాలు బయటపడ్డాయి. ఈ మూడు సింహాలను కూడా సక్కర్‌బగ్ జూకు పరీక్షల నిమిత్తం తరలించారు.
దాదాపు 10 వేల మెట్లు ఎక్కాల్సిందే..
గిర్నార్ కొండ జైన్, హిందూ ఆలయాలకు ప్రసిద్ధి. అంబాజీ, దత్తాత్రేయ స్వామి ఆలయం కొండపై కొలువై ఉంది. ఇక దర్శనానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు కొండపైకి కాలినడక మార్గంలో తరలివెళ్తుంటారు. కొండపైకి చేరుకోవాలంటే దాదాపు 10 వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- ●Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
- ●HPCL | హెచ్పీసీఎల్లో ఉద్యోగాల భర్తీ.. 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్
- ●Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!
- ●Horoscope | జూలై 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి..!
- ●Hyderabad Traffic Police Special Drive | హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఆ తప్పులు చేస్తే భారీ ఫైన్ తప్పదు!
- ●Ashwini Vaishnaw | హైదరాబాద్లో 3 బుల్లెట్ రైలు కారిడార్లు

Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

HPCL | హెచ్పీసీఎల్లో ఉద్యోగాల భర్తీ.. 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!

Horoscope | జూలై 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి..!






