త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss | హిందీ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా గౌర‌వ్ ఖ‌న్నా – సాఫ్ట్‌వేర్ జాబ్ వ‌దిలి… సీరియ‌ల్స్ యాక్ట‌ర్‌గా ఎంట్రీ

Bigg Boss | బిగ్‌బాస్ (Bigg Boss) హిందీ సీజ‌న్ 19 విన్న‌ర్‌గా టీవీ యాక్ట‌ర్ గౌర‌వ్ ఖ‌న్నా (Gaurav Khanna) నిలిచాడు. ఈ రియాలిటీ షో విన్న‌ర్‌గా నిలిచిన గౌర‌వ్‌కు యాభై ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. బిగ్‌బాస్ 19కు స‌ల్మాన్ ఖాన్(Salman Khan) హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు.

N

Uncategorized | Published On Dec 8, 2025, 10.50 am IST

Bigg Boss | హిందీ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా గౌర‌వ్ ఖ‌న్నా – సాఫ్ట్‌వేర్ జాబ్ వ‌దిలి…  సీరియ‌ల్స్ యాక్ట‌ర్‌గా ఎంట్రీ

గౌరవ్ ఖన్నా

Advertisement

Bigg Boss | హిందీ బిగ్‌బాస్ (Bigg Boss) సీజ‌న్ 19 గ్రాండ్ ఫినాలే చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగింది. వంద రోజుల‌కుపైగా సాగిన బిగ్గెస్ట్ రియాలిటీ షోలో విన్న‌ర్‌గా టీవీ యాక్ట‌ర్ గౌర‌వ్ ఖ‌న్నా (Gaurav Khanna) నిలిచాడు. ఫ‌ర్షానా భ‌ట్ ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఫైన‌ల్‌కు గౌర‌వ్ ఖ‌న్నా, ఫ‌ర్షాహా భ‌ట్‌తో పాటు అమ‌ల్ మాలిక్‌, తాన్య మిట్ట‌ల్‌, ప్ర‌ణీత్ మోరే చేరారు. . ఫైన‌ల్ టాస్కుల్లో అమ‌ల్‌, తాన్య‌, ప్ర‌ణీత్ ఎలిమినేట్ అయ్యారు. గౌర‌వ్ ఖ‌న్నా, ప‌ర్షానా భ‌ట్ ఇద్ద‌రిని స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) స్టేజ్‌పైకి తీసుకొచ్చారు. గౌర‌వ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.
విన్న‌ర్‌గా నిలిచిన గౌర‌వ్‌కు బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు యాభై ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. గ్రాండ్ ఫినాలేకు కార్తిక్ ఆర్య‌న్‌, అన‌న్య పాండేతో పాటు స‌న్నీలియోస్ గెస్ట్‌లుగా వ‌చ్చారు.
ఎవ‌రీ గౌర‌వ్ ఖ‌న్నా...
ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని క‌న్ఫూర్‌కు చెందిన గౌర‌వ్ ఖ‌న్నా ఎంబీఏ పూర్తిచేసి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజ‌ర్‌గా చాలా కాలం పాటు ప‌నిచేశాడు. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఉద్యోగాన్ని వ‌దిలేశాడు. తొలుత కొన్ని యాడ్స్ ఫిల్మ్స్ చేశాడు. 2005లో సిద్ధాంత్ టీవీ సీరియ‌ల్‌తో గౌర‌వ్ ఖ‌న్నా బుల్లితెర‌పైకి అడుగుపెట్టాడు.
అనుప‌మ, సీఐడీ, జీవ‌న్ సాధీ, కుంకుమ్‌తో పాటు ఇర‌వైకిపైగా సీరియ‌ల్స్ చేశాడు. ఈ ఏడాది సెలిబ్రిటీ మాస్ట‌ర్ చెఫ్ రియాలిటీ షోలోను కంటెస్టెంట్‌గా పాల్గొన్న గౌర‌వ్ విన్న‌ర్‌గా నిలిచాడు. ఇదే ఇయ‌ర్‌లో బిగ్‌బాస్ టైటిల్ నెగ్గాడు. ఒకే ఏడాది రెండు రియాలిటీ షోల‌లో విజేత‌గా నిలిచి బాలీవుడ్ నాట పాపుల‌ర్ అయ్యాడు. బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన గౌర‌వ్ ఖ‌న్నాకు త‌న అప్‌క‌మింగ్ మూవీలో యాక్ట‌ర్‌గా ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్లు హోస్ట్ స‌ల్మాన్ ఖాన్ స్టేజ్‌పై ప్ర‌క‌టించాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement