Nayanthara | రూల్స్‌కు నయనతార బ్రేక్.. యంగ్ హీరోలతో రొమాన్స్‌కు సై..!
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార తన రూట్‌ని మార్చుకుంది. గతంలో పాటించిన కఠిన నిబంధనలకు చెక్ పెట్టి, ఇప్పుడు ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా చురుకుగా కనిపిస్తోంది. విభిన్న భాషల్లో, విభిన్న కథలతో దూసుకెళ్తున్న నయన్ లైనప్ చూస్తే ఆమె కెరీర్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
Entertainment | Published On Apr 22, 2026, 2.05 pm IST
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నంది. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం నయన్ పూర్తిగా కొత్త దశ కనిపిస్తోంది. గతంలో తనకు తానే కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టుకున్నది. ఇప్పుడు వాటికి చెక్ పెట్టింది. నయనతార సినిమా ప్రమోషన్స్, ఆడియో లాంచ్‌లు, మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండేది. యాడ్స్‌లో కూడా ఎక్కువగా కనిపించకపోవడం, పబ్లిక్ అపియరెన్సెస్ తక్కువగా ఉండేలా చూసుకునేంది. అయితే, విగ్నేశ్ శివన్‌తో వివాహం తర్వాత ఆమె దృక్పథంలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె గతంలో ఉన్నట్లుగా రూల్స్ పాటించడం లేదు.
సినిమా ఓపెనింగ్స్‌కి హాజరవడం, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం వంటి వాటికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే, కొన్ని ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ మాత్రం ఇంకా దూరంగా ఉండే పద్ధతి కొనసాగుతోంది. భవిష్యత్తులో పూర్తిగా ప్రమోషన్లలో కూడా చురుకుగా కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కెరీర్ విషయంలోనూ నయనతార దూకుడు పెంచారు. ‘టైర్-1 హీరోలతోనే నటిస్తా’ననే పరిమితి లేకుండా, కథకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ విభిన్న జానర్లను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి దిగ్గజాలతో సినిమాలు చేస్తూనే, హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కూడా నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకరవర ప్రసాద్ గారు’లో నటించిన నయన్.. బాలకృష్ణ మూవీకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ అన్న భాషల్లో సమతుల్యంగా ప్రాజెక్టులు తీసుకుంటూ బిజీ షెడ్యూల్ కొనసాగిస్తూ వస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న, మధ్య స్థాయి ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. యంగ్ హీరోలతో జోడీ కడుతూ కొత్త తరహా కంటెంట్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై కూడా ఆమె దృష్టి కొనసాగుతోంది. ‘మూకుత్తి అమ్మన్’ సీక్వెల్‌తో పాటు ‘రక్కాయ్’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లోనూ నటిస్తోంది. అలాగే కవిన్‌తో ‘హాయ్’, నివిన్ పౌలీతో ‘డియర్ స్టూడెంట్స్’ వంటి ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయి. నయన్ సినిమాల లైనప్ చూస్తే.. గతానికి, ప్రస్తుతానికి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



