Nayanthara | నయనతార బాలీవుడ్ మూవీ షూటింగ్ షురూ – సల్మాన్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసిన లేడీ సూపర్ స్టార్
సల్మాన్ ఖాన్ , నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ శనివారం ముంబాయిలో లాంఛ్ అయ్యింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Entertainment | Published On Apr 18, 2026, 3.53 pm IST
Nayanthara | సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ బాలీవుడ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ బాలీవుడ్ సినిమా శనివారం అఫీషియల్‌గా ముంబాయిలో లాంఛ్ అయ్యింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో సల్మాన్ ఖాన్, నయనతారతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. శనివారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. నెల రోజుల పాటు ముంబాయిలో సాగే ఫస్ట్ షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్, నయనతారలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా కోసం ముంబాయిలో మేకర్స్ ఓ గ్రాండ్ సెట్ వేశారట. ఈ సెట్‌లోనే షూటింగ్ జరుగుతోన్నట్లు చెప్పారు.
సెకండ్ బాలీవుడ్ మూవీ...
తెలుగు దర్శకుడితో సల్మాన్ ఖాన్ చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం. సల్మాన్ మార్కు మాస్ ఎలిమెంట్స్‌కు యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌జోడించి దర్శకుడు వంశీపైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం.షారుఖ్ ఖాన్ జవాన్ తర్వాత నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న సెకండ్ బాలీవుడ్ మూవీ ఇది. ఈ హిందీ సినిమాను తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారట.
ప్రాఫిట్స్‌లో షేరింగ్...
వంశీపైడిపల్లి సినిమా కోసం సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ప్రాఫిట్స్ షేరింగ్ బేసిస్ మీద ఈ సినిమాను అంగీకరించినట్లు చెబుతోన్నారు. 2023లో వచ్చిన టైగర్ 3 తర్వాత సల్మాన్ ఖాన్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ పరాజయాల కారణంగానే రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమా చేయాలని సల్మాన్ ఫిక్సైనట్లు చెబుతోన్నారు. వచ్చే ఏడాది ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
రీషూట్స్...
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా చేస్తోన్నారు. వార్ డ్రామాగా తెరకెక్కుతోన్న మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు, పేర్లపై రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాల వల్ల సినిమాలో చాలా సీన్లను రీషూట్ చేయాల్సివస్తుందట. దాంతో ఈ సినిమా పోస్ట్‌పోన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు నయనతార దక్షిణాదిలో ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా ఎనిమిది సినిమాలు చేస్తోంది. యశ్ టాక్సిక్‌తో పాటు ముక్కుత్తి అమ్మన్ 2, హాయ్, తెలుగులో బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీతో మరికొన్ని సినిమాలను అంగీకరించింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



