త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు రెవెన్యూ ఎలా వ‌స్తుందో తెలుసా?

N

Uncategorized | Published On Dec 5, 2025, 4.58 am IST

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు రెవెన్యూ ఎలా వ‌స్తుందో తెలుసా?

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌

Advertisement

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ... ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీకి ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇదివ‌ర‌కు సినిమా చూడాలంటే థియేట‌ర్ వెళ్లాల్సిందే. లేదంటే టీవీలో చూడాల్సిందే. న‌చ్చిన‌వి చూసే వెసులుబాటు ఆడియెన్స్‌కు ఉండేది కాదు. కానీ ఓటీటీ రాక‌తో అప‌రిమిత వినోదం అర చేతిలోకి వ‌చ్చింది. తెలుగు, త‌మిళం, ఇంగ్లీష్ మాత్ర‌మే కాదు... ప్ర‌పంచంలోని ఏ భాష సినిమా అయినా చూసే అవ‌కాశం ఓటీటీల‌తో ల‌భించింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో పెరిగిన టికెట్ ధ‌ర‌ల దృష్ట్యా ఆడియెన్స్ కూడా ఓటీటీల‌వైపే మొగ్గు చూపుతున్నారు. మ‌రోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిర్మాత‌ల‌కు అద‌న‌పు ఆదాయ మార్గాలుగా కూడా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. సినిమాల కోసం పెట్టిన బ‌డ్జెట్‌లో స‌గం వ‌ర‌కు ఓటీటీ రైట్స్ ద్వారానే నిర్మాత‌ల‌కు వెన‌క్కివ‌చ్చేస్తోంది. దాంతో ఓటీటీల క్రేజ్ పెరిగింది.
అస‌లు ఓటీటీల‌కు ఆదాయం ఎలా వ‌స్తుంది? అన్ని కోట్లు పెట్టి స్టార్ హీరోల సినిమాల రైట్స్ ఎలా కొంటార‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
యాడ్స్ ద్వారా ఆదాయం...
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ప్ర‌ధానంగా యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వ‌స్తుంది. సినిమా, వెబ్‌సిరీస్ మ‌ధ్య‌లో ప్ర‌తి ప‌ది, ప‌దిహేను నిమిషాల‌కు ఒక‌సారి యాడ్స్ వ‌స్తూనే ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ మిన‌హా మిగిలిన ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో ప్ర‌స్తుతం యాడ్స్ బేసేడ్ స్క్రీనింగ్‌ను అందుబాటులోకి వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలో ఈ యాడ్స్ ఎక్కువైపోతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
స‌బ్‌స్క్రిప్ష‌న్‌...
ఓటీటీల‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీల ద్వారా కూడా రెవెన్యూ వ‌స్తుంది. స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉంటేనే ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న కంటెంట్‌ను చూడొచ్చు. ఏడాది నుంచి నెల‌వారీగా వివిధ ప‌ద్ధ‌తుల్లో ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు వ‌సులూ చేస్తుంటాయి ఓటీటీ సంస్థ‌లు. నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థ‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఆహా ఓటీటీ వంటి త‌క్కువ ధ‌ర‌ల‌తో ఆడియెన్స్‌ను ఆక‌ర్షిస్తున్నాయి.
పే ఫ‌ర్ వ్యూ
ఫే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు రెవెన్యూ వ‌స్తుంది. ఈ విధానంలో ఓ సినిమా, వెబ్‌సిరీస్ లేదంటే ఇత‌ర కంటెంట్‌ను చూడాలంటే ఓ నిర్ణీత రెంట‌ల్ ఛార్జీలు చెల్లించాల్సివుంటుంది. ఈ పే ఫ‌ర్ వ్యూ విధానంలో కొంత భాగం కంటెంట్ క్రియేట‌ర్స్‌కు చెల్లించి మిగిలిన వాటాను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తీసుకుంటాయి. బుక్ మై షో, ముబీ వంటి ప్లాట్‌ఫామ్స్ ఇదే విధానాన్ని అనుస‌రిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement