OTT | తండ్రికి ఎదురుతిరిగిన సోనాక్షి – డైరెక్ట్‌గా ఓటీటీలోకి జ్యోతిక బాలీవుడ్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ మూవీ
కోలీవుడ్ హీరో సూర్య భార్య జ్యోతిక హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ సిస్టమ్ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హిందీ సినిమాలో సోనాక్షి సిన్హా మరో నాయికగా కనిపించబోతుంది.
Entertainment | Published On May 12, 2026, 5.30 pm IST
OTT | సోనాక్షి సిన్హా, జ్యోతిక హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ సిస్టమ్ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించారు. మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
ట్రైలర్ రిలీజ్...
మంగళవారం మేకర్స్ సిస్టమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పలుకుబడి, అధికారానికి... న్యాయానికి మధ్య నెలకొన్న సంఘర్షణతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. పవర్ ముందు నిజం నిలబడగలదా? న్యాయం గెలుస్తుందా? అనే అంశాలతో పాటు ధనిక పేద మధ్య అంతరాలను, కోర్టుల్లో నిజంగా పేదోడికి న్యాయం జరుగుతుందా అనే సందేశాన్ని ఈ సినిమాలో చర్చంచబోతున్నట్లు తెలుస్తోంది.
లాయర్‌గా సోనాక్షి...
ఇందులో నేహా అనే యువ లాయర్‌గా సోనాక్షి సిన్హా కనిపించబోతుంది. కోర్టుల్లోని లోతుపాతులన్నీ తెలిసిన స్టెనోగ్రాఫర్‌గా జ్యోతిక నటిస్తోంది. తండ్రి అడుగుజాడల్లోనే గొప్ప లాయర్‌గా కనిపించాలని అనుకున్న నేహా... చివరకు తండ్రికే వ్యతిరేకంగా కోర్టులో ఎందుకు వాదించాల్సివచ్చిందన్నదనే అంశాలతో సిస్టమ్ మూవీ రూపొందుతోన్నట్లు తెలుస్తోంది. సిస్టమ్ మూవీలో బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
గతంలో డైరెక్టర్‌గా బైరెల్లీకి బర్ఫీ, పంగా, తర్లా, బవాల్ సినిమాలు చేసింది అశ్విని అయ్యర్ తివారీ. మూడేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇవ్వబోతుంది.రెండేళ్ల క్రితం రిలీజైన సైతాన్‌తో యాక్టర్‌గా బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. శ్రీకాంత్‌తో పాటు డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది.
సంబంధిత వార్తలు

Sonakshi Sinha | భార్య హీరోయిన్ – భర్త విలన్ – పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
అక్టోబర్ 6, 2026

Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం – నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు
అక్టోబర్ 5, 2026

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు – నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు – ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం రిలీజ్లో కొత్త ట్విస్ట్ - రష్మిక మందన్నతో పోటీ!
- ●Strait of Hormuz | హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు
- ●BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
- ●Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం
- ●TGHRC | ఎడమ కన్నుకు బదులుగా కుడి కన్నుకు సర్జరీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ
- ●MERITE | తెలంగాణలో 'మెరిట్' స్కీమ్ అమలు

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం రిలీజ్లో కొత్త ట్విస్ట్ - రష్మిక మందన్నతో పోటీ!

Strait of Hormuz | హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు

BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం

Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం



