Indian Passport Visa-Free Countries 2026 | భారత పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ వెళ్లగలిగే 27 దేశాలు ఇవే!
విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకుండానే 27 దేశాలకు ఈజీగా ప్రయాణించవచ్చు. ఆ దేశాల జాబితా ఏంటో తెలుసా?
Indian Passport Visa-Free Countries 2026 | త్రినేత్ర.న్యూస్ : మీరు ఎప్పటినుంచో విదేశీ యాత్ర (International Trip) చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఇండియన్ పాస్‌పోర్ట్ (Indian Passport) ఉన్నవారు ఇప్పుడు ఎలాంటి వీసా (Visa) లేకుండానే ప్రపంచంలోని 27 దేశాలను సులభంగా చుట్టిరావచ్చు. భారతీయ ప్రయాణికులకు సులభతరమైన ఎంట్రీ నిబంధనలు అమలులో ఉన్నాయని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ప్రయాణికులకు ప్రపంచవ్యాప్తంగా 74 గమ్యస్థానాలకు సులభమైన యాక్సెస్ లభించింది. ఇందులో 27 దేశాలు వీసా-ఫ్రీ (Visa-free) ఎంట్రీని అందిస్తుండగా, 47 దేశాలు వీసా-ఆన్-అరైవల్ (Visa-on-arrival) సదుపాయాన్ని ఇస్తున్నాయి. అలాగే, మరో 66 దేశాలు భారతీయులకు ఈ-వీసా (e-Visa) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ సడలింపుల కారణంగా ఇంటర్నేషనల్ వెకేషన్ ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారింది.
భారతీయులు వీసా లేకుండా వెళ్లగలిగే 27 దేశాల పూర్తి జాబితా ఇదే
1. భూటాన్ (Bhutan) : వీసా అవసరం లేదు, కానీ ఎంట్రీ పర్మిట్ (Entry permit) దరఖాస్తు చేసుకోవాలి.
2. నేపాల్ (Nepal) : భారతీయులకు ఎలాంటి పరిమితులు లేవు.
3. మారిషస్ (Mauritius) : 90 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణం, బస చేయవచ్చు.
4. థాయ్‌లాండ్ (Thailand) : 30 రోజుల వరకు వీసా లేకుండా ఎంట్రీ పొందవచ్చు.
5. కజకిస్తాన్ (Kazakhstan) : 14 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఉంది.
6. మలేషియా (Malaysia) : డిసెంబర్ 2026 వరకు, 30 రోజుల పాటు వీసా-ఫ్రీ అనుమతి కల్పించారు.
7. సీషెల్స్ (Seychelles) : ఇది పూర్తిగా వీసా-ఫ్రీ దేశం, ఇక్కడ వీసా అవసరమే లేదు.
8. కుక్ ఐలాండ్స్ (Cook Islands) : 31 రోజుల వరకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
9. నియు (Niue) : 30 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణానికి అనుమతి.
10. ఇరాన్ (Iran) : సాధారణ పాస్‌పోర్ట్ ఉంటే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి 15 రోజుల వరకు వీసా-ఫ్రీ యాక్సెస్.
11. మకావ్ (Macau) : 30 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణం.
12. ఫిజీ (Fiji) : 120 రోజుల వరకు వీసా-ఫ్రీ, కానీ చేరుకున్న తర్వాత ఆన్-అరైవల్ విజిట్ పర్మిట్ (Visit permit) పొందాలి.
13. బార్బడోస్ (Barbados) : 90 రోజుల వరకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
14. డొమినికా (Dominica) : 180 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణానికి అవకాశం.
15. గ్రెనడా (Grenada) : 90 రోజుల వరకు వీసా-ఫ్రీ అనుమతి కలదు.
16. సెనెగల్ (Senegal) : గ్రెనడా తరహాలోనే భారతీయులు 90 రోజుల వరకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
17. హైతీ (Haiti) : 90 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణానికి అనుమతి.
18. ఎల్ సాల్వడార్ (El Salvador) : ఇక్కడికి వెళ్లడానికి 90 రోజుల వరకు వీసా అవసరం లేదు.
19. మైక్రోనేషియా (Micronesia) : 30 రోజుల వరకు వీసా లేకుండా వెళ్లొచ్చు.
20. ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago) : 90 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణం.
21. సెయింట్ విన్సెంట్ & గ్రెనడైన్స్ (St. Vincent & the Grenadines) : 90 రోజుల వరకు వీసా-ఫ్రీ అనుమతి.
22. గాంబియా (Gambia) : 90 రోజుల వరకు వీసా అవసరం లేదు.
23. జమైకా (Jamaica) : ఇక్కడ భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఎలాంటి పరిమితులు లేవు.
24. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ (Saint Kitts and Nevis) : 90 రోజుల వరకు వీసా-ఫ్రీ ప్రయాణం.
25. మోంట్‌సెరాట్ (Montserrat) : టూరిజం, బిజినెస్ కోసం షార్ట్-స్టే కింద 180 రోజుల వరకు వీసా మినహాయింపు ఇచ్చారు.
26. వనాటు (Vanuatu) : ఎంట్రీ నిబంధనల ఆధారంగా 30 నుంచి 120 రోజుల వరకు వీసా-ఫ్రీగా ప్రయాణించవచ్చు.
27. అంగోలా (Angola) : 30 రోజుల వరకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Visa-Free Countries For Indians 2026 | వీసా టెన్షన్ లేదు.. ప్యాకింగ్ చేసుకొని బయలుదేరడమే! భారత పాస్‌పోర్ట్‌తో 2026లో వీసా లేకుండా వెళ్లగల 7 దేశాలు
సెప్టెంబర్ 22, 2026

Indian Passport | 10 స్థానాలు మెరుగు పరుచుకున్న భారత పోస్‌పోర్టు.. ఇప్పుడు ర్యాంకు ఎంతంటే..?
ఫిబ్రవరి 14, 2026

సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్‌ది హైదరాబాదే : తెలంగాణ డీజీపీ
డిసెంబర్ 16, 2025
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



