YS Vijayamma | షర్మిలకు జగన్ అన్యాయం చేశాడు.. వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు
YS Vijayamma | ఆస్తుల పంపకం విషయంలో షర్మిలకు జగన్ అన్యాయం చేశారని వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి సాక్షిగా నేను చెప్పేవన్నీ నిజాలే అని ఆమె స్పష్టం చేశారు.
YS Vijayamma | త్రినేత్ర.న్యూస్ : ఆస్తుల పంపకం విషయంలో షర్మిలకు జగన్ అన్యాయం చేశారని వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి సాక్షిగా నేను చెప్పేవన్నీ నిజాలే అని ఆమె స్పష్టం చేశారు. కుటుంబ ఆస్తుల పంపకాలపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో వివాదం కొనసాగుతున్న వేళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మ మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు.
2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనువలు, మనువరాళ్లకు సమానంగా పంచాలనేది వైఎస్సార్ ఉద్దేశ్యం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంవోయూ రాశాడు. (నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్‌తో సహా ఎంవోయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే).
ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్‌కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు..? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయo. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






