త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | విజ‌య‌వాడ వెళ్లి చంద్ర‌బాబుకు చెప్పివ‌చ్చా : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వే టు న్యూస్ కాన్‌క్లేవ్ 2026లో ప‌లు అంశాల‌పై మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో తనకు చాలా చొరవ ఉందని తెలిపారు.

P

Telangana | Published On May 15, 2026, 8.45 pm IST

CM Revanth Reddy | విజ‌య‌వాడ వెళ్లి చంద్ర‌బాబుకు చెప్పివ‌చ్చా : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వే టు న్యూస్ కాన్‌క్లేవ్ 2026లో ప‌లు అంశాల‌పై మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో తనకు చాలా చొరవ ఉందని తెలిపారు. “నా గీత నేను దాటను” అని వ్యాఖ్యానించారు. తాను టీడీపీలో 10 సంవత్సరాలు పనిచేశానని, చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తనను గౌరవిస్తారని పేర్కొన్నారు. పార్టీని వదిలిపెట్టిన తర్వాత నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉండటం చాలా అరుదని అన్నారు. పార్టీని వదిలే సమయంలో విజయవాడకు వెళ్లి చంద్రబాబుకు చెప్పి వచ్చానని తెలిపారు.

స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్న‌రు..

కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్న లక్ష్యం రాహుల్ గాంధీకి ఉందని, కానీ ప్రధాని కావాలన్న లక్ష్యం లేదని అన్నారు. వికారాబాద్‌లో జరిగిన సమావేశంలో ప్రధాని పదవి తీసుకోవాలని తానే రాహుల్ గాంధీని ఒప్పించానని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు “స్విగ్గి పాలిటిక్స్” కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ ముందుగా ప్రకటన చేసి తర్వాత ఇండియా కూటమిని ఒప్పిస్తామని తెలిపారు. ఇండియా కూటమి తరపున పాలసీ డాక్యుమెంట్ తీసుకువచ్చి ప్రజలను తీర్పు ఇవ్వమని కోరుతామని అన్నారు.

2034 వ‌ర‌కు కాంగ్రెస్‌దే అధికారం..

2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్‌కు అధికారం ఉంటుందని చెప్పారు. 2034 వరకు తాను తెలంగాణలోనే ఉంటానని, ఈ ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ జీడీపీని దేశానికి 10 శాతం ఇచ్చేలా పని చేస్తానని అన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉండనని, తరువాత తరానికి అవకాశం ఇస్తానని చెప్పారు. దేశానికి కూడా సేవలందిస్తానని, తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి ఆయన ఇచ్చిన చైర్‌లో తాను కూర్చుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement