త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Chandrababu | తాటి ముంజ‌లు తింటుంటే ఎంతో హాయి.. చంద్ర‌బాబు ట్వీట్

CM Chandrababu | కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. కాసేపు సామాన్యుడిలా మారిపోయారు. మండుటెండ‌లో న‌డిరోడ్డుపై త‌న కాన్వాయ్‌ను ఆపించారు. ఇక రోడ్డు ప‌క్క‌నే విక్ర‌యిస్తున్న తాటిముంజ‌ల‌ను తిని.. ఎంతో అనుభూతి పొందారు సీఎం దంప‌తులు.

S

National | Published On May 20, 2026, 3.16 pm IST

CM Chandrababu | తాటి ముంజ‌లు తింటుంటే ఎంతో హాయి.. చంద్ర‌బాబు ట్వీట్
Advertisement

CM Chandrababu | త్రినేత్ర‌.న్యూస్ : కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. కాసేపు సామాన్యుడిలా మారిపోయారు. మండుటెండ‌లో న‌డిరోడ్డుపై త‌న కాన్వాయ్‌ను ఆపించారు. ఇక రోడ్డు ప‌క్క‌నే విక్ర‌యిస్తున్న తాటిముంజ‌ల‌ను తిని.. ఎంతో అనుభూతి పొందారు సీఎం దంప‌తులు.

కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు తాటి ముంజ‌ల విక్ర‌య‌దారులు కంట‌ప‌డ్డారు. దీంతో స‌డెన్‌గా బాబు త‌న కాన్వాయ్‌ను ఆపించారు. ఇక సీఎంను చూసి విక్ర‌య‌దారులు కూడా సంబుర‌ప‌డ్డారు. తాజా తాటి ముంజ‌ల‌ను తీసి.. సీఎం దంప‌తుల‌కు అంద‌జేశారు. తాటి ముంజల‌ను తింటూ సీఎం పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. అనంత‌రం వారికి డ‌బ్బులు అంద‌జేసి అటునుంచి వెళ్లిపోయారు. తాటిముంజ‌ల విక్ర‌య‌దారుల‌తో చంద్ర‌బాబు ఫొటోలు దిగి కాసేపు ముచ్చ‌టించి, వారి క‌ష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్చమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది! అని సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement