Sharmila | అవినీతి డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు..!
Sharmila | ఆమె పేరు షర్మిల. హోదా డిప్యూటీ కలెక్టర్. చాలా కాలంగా డిప్యుటేషన్‌పై హెచ్ఎండీఏలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన అనేక అవినీతి, అక్రమాలపై ఆ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్, మొదలుకొని సీఎం ఆఫీసు వరకు ఆమెపై బాధిత ప్రజలు ఫిర్యాదులు చేశారు.
విజిలెన్స్ నుంచి సీఎం ఆఫీస్ వరకు అనేక ఫిర్యాదులు
షర్మిల అవినీతి వ్యవహారంపై అంతర్గత విచారణ
ఉట్నూర్ ఆర్డీఓగా బదిలీ చేసినా.. హెచ్ఎండీఏలోనే తిష్ట
డిప్యూటీ కలెక్టర్ షర్మిలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ
అనుమతి లేకుండా ఆఫీస్ దాటొద్దని హూకుం
Sharmila | త్రినేత్ర.న్యూస్ : ఆమె పేరు షర్మిల. హోదా డిప్యూటీ కలెక్టర్. చాలా కాలంగా డిప్యుటేషన్‌పై హెచ్ఎండీఏలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన అనేక అవినీతి, అక్రమాలపై ఆ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్, మొదలుకొని సీఎం ఆఫీసు వరకు ఆమెపై బాధిత ప్రజలు ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ ఎం.షర్మిల వ్యవహారంపై అంతర్గత విచారణ చేసిన అధికారులు ఆమెను ముందుగా అక్కడి నుండి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆమెను కొంత కాలం క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీఓ) గా, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు. కానీ డిప్యూటీ కలెక్టర్ ఎం.షర్మిల మాత్రం హెచ్ఎండీఏలో కుర్చీని మాత్రం వదలడం లేదు. ఉన్నతాధికారులు అనేక దఫాలుగా పోస్టింగ్ ఇచ్చిన స్థానానికి వెళ్లాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినా డిప్యూటీ కలెక్టర్ ఎం.షర్మిల పెడ చెవిన పెట్టారు. ప్రభుత్వ ఆదేశాలను లైట్ తీసుకోవడమే కాకుండా బదిలీ ఉత్తర్వులను ధిక్కరించారు.
దీంతో డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీసీఎల్ఏ కమిషనర్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు టీసీఎస్ (సీసీ&ఏ) నియమావళి, 1991లోని నియమం 8 ప్రకారం డిప్యూటీ కలెక్టర్ షర్మిలను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఈ నెల19వ తేదీన సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ షర్మిల బదిలీ అయిన స్థానంలో జాయిన్ కానీ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్‌పై ప్రభావం పడిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆమె సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని సీసీఎల్ఏ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ కలెక్టర్ షర్మిల పై సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉన్న కాలంలో సీసీఎల్ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్ళవద్దని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!

Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..






