త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaishnavi’s Husband Murdered | యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త దారుణ హ‌త్య‌.. దుండ‌గులు ఎలా చంపారంటే..

Vaishnavi's Husband Murdered | నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబును దుండ‌గ‌లు న‌రికి చంపారు.

S

Telangana | Published On Sep 17, 2026, 7.08 pm IST

Vaishnavi’s Husband Murdered | యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త దారుణ హ‌త్య‌.. దుండ‌గులు ఎలా చంపారంటే..
Advertisement

Vaishnavi's Husband Murdered | త్రినేత్ర‌.న్యూస్‌: నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబును దుండ‌గ‌లు న‌రికి చంపారు. న‌గ‌రంలోని రాజరాజేంద్ర సెంటర్‌లో హరిబాబును కొబ్బరి కాయలు కోసే కత్తితో నరికి ప్రాణాలు తీశారు. జగిత్యాల జిల్లాలో 5 నెలల క్రితం హత్యకు గురైన యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసులో ఆమె భర్త అయిన హరిబాబు నిందితుడిగా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్య‌క్తులు ఈ దాడిలో పాల్గొన్న‌ట్లు పేర్కొన్నారు. పాత క‌క్ష్య‌ల నేప‌థ్యంలోనే ఈ హ‌త్య జ‌రిగిన‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పోలీసుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి (24), చిథారి హరిబాబు ల‌వ్ మ్యారేజ్‌ చేసుకున్నారు. వైష్ణవి 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా అదనపు కట్నం కోసం హరిబాబు, అతని కుటుంబ సభ్యులు వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించారు. ఇదే విషయమై గ‌త‌ మార్చి 16 రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న వైష్ణ‌విని మార్చి 17న భర్త హరిబాబు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. హరిబాబు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ నేప‌థ్యంలో వైష్ణవి కేసుకు.. హరిబాబు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement