త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponguleti | కేటీఆర్‌ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్‌

Minister Ponguleti | బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఒక్క ఎకరం భూమి మాత్రమే ఉన్న కేటీఆర్‌కు నేడు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

P

Telangana | Published On Sep 17, 2026, 8.02 pm IST

Minister Ponguleti | కేటీఆర్‌ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్‌
Advertisement

Minister Ponguleti | బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఒక్క ఎకరం భూమి మాత్రమే ఉన్న కేటీఆర్‌కు నేడు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ‘ఏళ్ల తరబడి కేటీఆర్‌ తన ‘అమెరికా సక్సెస్‌’ గురించి గొప్పలు చెప్పుకుంటూ.. చిన్నప్పటి నుంచే తనకు వందల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పుకున్నారు. కానీ, ఆయన స్వయంగా దాఖలు చేసిన 2009 ఎన్నికల అఫిడవిట్‌ మాత్రం మరో విషయాన్ని చెబుతోంది. మరి ఒక్క ఎకరం ఉన్న భూమి వందల ఎకరాలుగా.. వేల కోట్ల విలువైన భూములుగా ఎలా మారింది? అధికారం అండగా.. ధరణి ఆయుధంగా.. ప్రభుత్వ, దళితుల భూములే లక్ష్యంగా చేసుకున్నారా?’ అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆధారాలతో సహా కల్వకుంట్ల కుటుంబ భూ వ్యవహారాలను ఎండగట్టారని మంత్రి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు అప్పులపాలయ్యారని.. కేసీఆర్‌ కుటుంబం మాత్రం వేల కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల పునాదులపై కల్వకుంట్ల కుటుంబం భారీ ఆస్తులను కూడబెట్టుకుందని విమర్శించారు. కుటుంబ పాలనలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్న కేటీఆర్‌ ఇప్పుడు తెలంగాణకు నీతులు చెబుతున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ‘దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఇంతకంటే నమ్మశక్యంగా ఉండేది’ అని ఎక్స్‌ పోస్టులో మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement