Gajjela Kantham | వందల ఎకరాలే ఉంటే నువ్వు, నీ చెల్లె అమెరికా పోయేటోళ్లా?
Gajjela Kantham | కేసీఆర్ (KCR)కు వందల ఎకరాలే ఉంటే కేటీఆర్, కవిత అమెరికా పోయేటోళ్లా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ప్రశ్నించారు.
- భూములన్నీ ఆంధ్రోళ్ల దగ్గర ఉన్నయని కేసీఆరే అన్నడు
- రామోజీరావు భూములను లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్ మాట ఏమైంది?
- కేసీఆర్ ఫ్యామిలీపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఫైర్
Gajjela Kantham | త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ (KCR)కు వందల ఎకరాలే ఉంటే కేటీఆర్, కవిత అమెరికా పోయేటోళ్లా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ప్రశ్నించారు. భూములన్నీ ఆంధ్రావాళ్ల దగ్గరే ఉన్నాయని కేసీఆర్ చెప్పారని, రామోజీరావు (Ramoji Rao) భూములను లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్ మాట ఏమైందని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి రాచరిక పరిపాలన చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని తన్ని తరిమే రోజులు దగ్గర పడ్డాయి. 2001నుంచి 2014 దాకా నీళ్లు, నియామకాలు మన భూములు అన్నాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రజలకు తెలుసు.
రామోజీరావు దగ్గర భూములు ఉన్నాయి.. లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తా అన్నడు. ఇప్పుడు ఎక్కడ పోయాయి ఆ భూములు? అధికారంలోకి వచ్చాక తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని దగా చేశారు. మీకు 100 వందల ఎకరాల భూములు ఉంటే నువ్వు, నీ చెల్లె అమెరికా పోతారా కేటిఆర్? మాకు 10 నుంచి ఎకరాలు భూమి ఉంది అని మా అయ్య చెప్పిండు అని కేటిఆర్ అన్నడు. 1932లో మా వందల ఎకరాలు ప్రాజెక్టులో పోతే మా నానమ్మకు లక్షల రూపాయలు వచ్చాయి అంటుండు. అబద్ధాలు మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారు అని గజ్జెల కాంతం తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
సంబంధిత వార్తలు

TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్..!
సెప్టెంబర్ 17, 2026

Errabelli Dayakar Rao | అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలకు తెరలేపిండు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
సెప్టెంబర్ 17, 2026

Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. కత్తితో నరికి చంపిన దుండగులు
- ●Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ - ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్
- ●Section 22A Land Issues Telangana | రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్ ప్రసంగం చరిత్రాత్మకం
- ●TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్..!
- ●Errabelli Dayakar Rao | అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలకు తెరలేపిండు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ●Malka Komaraiah - AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి

Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. కత్తితో నరికి చంపిన దుండగులు

Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ - ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్

Section 22A Land Issues Telangana | రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్ ప్రసంగం చరిత్రాత్మకం

TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్..!



