త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ex MLA Jeevan Reddy | అర‌ గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్‌.. డ‌బ్బు కోసం ఏమైనా తినే క‌క్కుర్తిగాడివి

Ex MLA Jeevan Reddy | అర‌వింద్ (Aravind) అంటేనే హాఫ్ నాలేడ్జ్‌కి మారుపేర‌ని.. అబ‌ద్దానికి అంగీ లాగు తొడిగితే అర‌వింద్ అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Sep 28, 2026, 5.44 pm IST

Ex MLA Jeevan Reddy | అర‌ గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్‌.. డ‌బ్బు కోసం ఏమైనా తినే క‌క్కుర్తిగాడివి
Advertisement
  • కాళేశ్వ‌రం క‌ట్ట‌కుంటే మోటార్లు ఎట్ల ఆన్ చేసిర్రురా ప‌నికిమాల్న ఎధ‌వా
  • నిజామాబాద్‌కు న‌యా పైసా తేలేని ద‌ద్ద‌మ్మ‌వు.. ప‌సుపు బోర్డు ఏడుందో చూపెట్టు
  • నువ్వొక చార్లెస్ శోభరాజ్‌వి, ఆ రాకేశ్‌రెడ్డో దావూద్ ఇబ్రహీమ్‌
  • మోదీని తోల్కొచ్చి కేసీఆర్ ఫామ్‌హౌస్ కొలువు.. ఎక్కువుంటే తీస్కో
  • కేసీఆర్ ఫ్యామిలీ జోలికొస్తే నాలుక చీరేస్తం
  • ఎంపీ అర‌వింద్‌పై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రుస‌రుస‌

Ex MLA Jeevan Reddy | త్రినేత్ర న్యూస్: అర‌వింద్ (Aravind) అంటేనే హాఫ్ నాలేడ్జ్‌కి మారుపేర‌ని.. అబ‌ద్దానికి అంగీ లాగు తొడిగితే అర‌వింద్ అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి ఎద్దేవా చేశారు. డ‌బ్బు కోసం గడ్డే కాకుండా ఏదైనా తినే క‌క్కుర్తిగాడ‌ని విమ‌ర్శించారు. నిజామాబాద్‌కు న‌యా పైసా తేలేని దద్ద‌మ్మ అని ధ్వ‌జ‌మెత్తారు. అర‌విందొక చార్లెస్ శోభ‌రాజ్ అయితే, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డొక (MLA Rakesh Reddy) దావూద్ ఇబ్ర‌హీమ్ అని ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ జోలికొస్తే నాలుక చీరేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వ‌హించిన‌ విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. రేవంత్ పేటీఎం బ్యాచ్ సభ్యుడు అరవింద్ అని ఫైర‌య్యారు.

జనకచర్ల అనేటోడే అరవింద్

అహంకారం, అవినీతి, అబద్దానికి అంగి, లాగు తొడిగితే అది అరవింద్. అయ్యపేరు చెప్పుకుని 2004లో కాంగ్రెస్ బీ ఫామ్ లు అమ్ముకున్నడు. రేవంత్ రెడ్డిని పగలు తిడతాడు, రాత్రి పోయి పొర్లుదండలు పెడతడు. అరవింద్ ఎంపీగా గెలవడం నిజమాబాద్ జిల్లా దురదృష్టం. బనకచర్లను జనకచర్ల అనేటోడు అరవింద్. నిజామాబాద్ కు నయాపైసా తేలేని చేతకాని దద్దమ్మ. రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయా నీది?

రేవంత్ పేటీఎం బ్యాచ్ సభ్యుడు

రేవంత్ పేటీఎం బ్యాచ్ సభ్యుడు అరవింద్. కాంగ్రెస్‌తో పోరాడే శక్తి లేక కేసీఆర్‌ను తిడుతుండు. తెలంగాణ ఉద్యమంలో అరవింద్ పాత్ర అణా పైసా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇంకెంత కాలం విషం కక్కుతారు. చిల్లర రాజకీయాలకు అడ్డా అరవింద్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిందే మొత్తం 84 వేల కోట్ల రూపాయలు. మరి లక్షన్నర కోట్ల అవినీతి ఎక్కడి నుంచి జరిగింది అబద్ధాలకోరు అరవింద్. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కట్టలేదని చెప్పదల్చుకున్నవా? కట్టకపోతే నిన్ననే మోటార్లు ఎట్లా ఆన్ చేశారురా పనికిమాలిన వెధవ.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఎన్నెకరాల భూమి ఉందో నువ్వు, నీ మోదీ వచ్చి కొలిపించుకోండి. నిజంగా 700 ఎకరాల భూమి ఉంటే నువ్వే తీసుకో. నీ ఇల్లు, నీ కుటుంబమే అవినీతి, అబద్దాల పునాదులపై నిర్మాణం అయింది. నీ అయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. నువ్వు మీ అయ్య దగ్గరకు వచ్చే ఇతర కాంగ్రెస్ నేతల జేబులు కొట్టి బతికిన జేబు దొంగవు. సొంత సోదరుడిని మోసం చేసి అడుక్కు తినేల చేసిన దగాకోరువి.

బీజేపీ జోకర్, పొలిటికల్ బ్రోకర్

నువ్వే ఒక చార్లెస్ శోభరాజ్ వి, నీ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక దావూద్ ఇబ్రహీం. నువ్వొక డ్రగ్స్ స్మగ్లర్‌వి, రాకేష్ రెడ్డి ఒక ఎర్ర చందనం దొంగ, బంగారం స్మగ్లర్. అరవింద్ కాదు రాబంధు. నీ ఇంటి పేరు ధర్మపురి కాదు.. ధర్మానికి ఉరి. అధర్మానికి పుట్టిన అడ్డగాడిదవు. నిజామాబాద్ జిల్లాను పట్టి పీడిస్తున్న దగాకోరు, అవినీతి, అబద్దాల కోరు. అబద్దాలకు అరవింద్ నిలువెత్తు అద్దం. బీజేపీ జోకర్, పొలిటికల్ బ్రోకర్. పదవుల కోసం రంగులు మార్చే ఊసరవెల్లి.

ప‌సుపు బోర్డు యాడుందో చెప్పు

ఎంపీగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి నయాపైస తెచ్చావా? పసుపు బోర్డు ఎక్కడుందో చెప్పు. అరవింద్ రైతు ద్రోహి. ధర్మపురి కుటుంబమే పెద్ద యమపురి. తెలంగాణ ఉద్యమంలో అరవింద్ కుటుంబం ఎక్కడుంది? కాంగ్రెస్ పల్లకి మోస్తున్న బీజేపీ. రేవంత్ రెడ్డి మౌత్ స్పీకర్ గా అరవింద్. కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించే స్థాయా నీది? కేసీఆర్ ది ఉద్యమ కుటుంబం. అరవింద్ ది అవినీతి ఫ్యామిలీ అని జీవ‌న్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఊగిపోయారు.

బేవ‌కూఫ్.. నీ భ‌ర‌తం ప‌డ‌తం

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాలిగోటికి సరిపోని సన్నాసి అరవింద్. "బేవకూఫ్, బేకార్, భట్టేబాజ్, అరగుండు, చెత్త సన్నాసి, సైకో, శాడిస్ట్, డ్రగ్స్ అడిక్ట్, అన్నీ ఈ అబద్దాల, అవినీతి అరవిందే. బట్టేబాజ్ మాటలు చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి రెండు సార్లు ఓట్లు వేయించుకున్నవ్‌. పసుపుకు మద్దతు ధరలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు రైతులకు అండగా నిలవడం లేదు. నోటి దురద మాటలతో కేసీఆర్ ఫ్యామిలీపై విషం కక్కుతున్న అరవింద్ భరతం పట్టడానికి గులాబీ సైన్యం సిద్ధంగా ఉంది అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement