Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్‌రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!
Vithya Ramraj | ట్రాక్‌పై భారత సంచలనం విత్యా రామ్‌రాజ్ మరోసారి సత్తా చాటింది. ఆసియా గేమ్స్-2026లో ఒకటి కాదు.. రెండు పతకాలతో మెరిసింది. మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో రజతం సాధించిన నాలుగు రోజులకే.. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Vithya Ramraj | ట్రాక్‌పై భారత సంచలనం విత్య రామ్‌రాజ్ మరోసారి సత్తా చాటింది. ఆసియా గేమ్స్-2026లో ఒకటి కాదు.. రెండు పతకాలతో మెరిసింది. మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో రజతం సాధించిన నాలుగు రోజులకే.. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. 54.75 సెకన్లతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసింది. గత ఆసియా గేమ్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో 55.42 సెకన్ల టైమింగ్‌తో దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష నెలకొల్పిన జాతీయ రికార్డును బ్రేక్ చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన ఉష రికార్డును అధిగమించింది.
సెప్టెంబర్ 24న జరిగిన మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో విత్య యాంకర్‌గా బరిలోకి దిగింది. చివరి దశలో భారత్ వెనుకబడి ఉండగా.. విథ్యా అద్భుతంగా పుంజుకుని వియత్నాంను అధిగమించింది. 3:14.46 సెకన్ల టైమింగ్‌తో భారత్‌కు రజతం అందించింది. అక్కడితో ఆగలేదు. నాలుగు రోజులకే తన వ్యక్తిగత ఈవెంట్ 400 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగి.. 54.75 సెకన్లతో రేసును పూర్తి చేసి కాంస్య పతకం సాధించింది.
ఈ రేసులో యూఏఈకి చెందిన మరియమ్ కరీమ్ 54.31 సెకన్లతో గేమ్స్ రికార్డు సాధించి స్వర్ణం గెలుచుకుంది. కజకిస్థాన్‌కు చెందిన అడెలినా జెమ్స్ 54.58 సెకన్లతో రజతం సాధించింది. విథ్యా 54.75 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. మరో భారత అథ్లెట్ అనూ రాఘవన్ 55.88 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. విత్య రామ్‌రాజ్‌కు ఇది ఆసియా గేమ్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకం. ఒకవైపు రిలేలో జట్టు కోసం కీలకంగా రాణిస్తూ.. మరోవైపు వ్యక్తిగత విభాగంలో పర్సనల్ బెస్ట్‌తో పోడియం చేరుతూ భారత అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు
- ●Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్
- ●Allu Arjun | పోలీస్ ఆఫీసర్‌గా బన్నీ - లోకేష్ కనగరాజ్ సినిమాపై కొత్త రూమర్?
- ●Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి
- ●Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!
- ●National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి

Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు

Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్

Allu Arjun | పోలీస్ ఆఫీసర్‌గా బన్నీ - లోకేష్ కనగరాజ్ సినిమాపై కొత్త రూమర్?

Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి




