National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి
National Conference | రబీ సాగుకు తెలంగాణ సర్వసన్నద్ధమవుతోంది. స్వయంసమృద్ధి, పంటల వైవిధ్యీకరణతోపాటు సుస్థిర వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని జాతీయ వేదికపై వివరించింది.
National Conference | రబీ సాగుకు తెలంగాణ సర్వసన్నద్ధమవుతోంది. స్వయంసమృద్ధి, పంటల వైవిధ్యీకరణతోపాటు సుస్థిర వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని జాతీయ వేదికపై వివరించింది. న్యూఢిల్లీలోని పూసా ఎన్‌ఏఎస్‌సీ కాంప్లెక్స్‌లో సోమవారం ప్రారంభమైన రబీ–2026 జాతీయ వ్యవసాయ సదస్సులో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రగతి నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధుల ముందు ఉంచారు.
పప్పుధాన్యాలు, నూనెగింజలపై ప్రత్యేక దృష్టి
రబీ 2026–27లో సుమారు లక్ష ఎకరాల్లో పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు 29,009 క్వింటాళ్ల ధ్రువీకరించిన విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శనగ సాగు విస్తీర్ణాన్ని 15 శాతం, పెసర, మినుము సాగును చెరో 5 శాతం పెంచేలా లక్ష్యాలు నిర్దేశించారు. జాతీయ వంటనూనెల మిషన్ (నూనెగింజలు) కింద రబీలో 20,490 హెక్టార్లలో సాగుకు 28,680 క్వింటాళ్ల విత్తనాలను విలువ గొలుసు క్లస్టర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. గత ఏడాది ఈ కార్యక్రమం ద్వారా 40,939 మంది రైతులు లబ్ధి పొందారు. రబీ సీజన్‌లో 78.73 లక్షల ఎకరాల సాగుకు 18.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా.. ఇప్పటికే 20.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
నకిలీ విత్తనాల నియంత్రణకు పీడీ చట్టాన్ని అమలు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అధికారులు సదస్సు దృష్టికి తీసుకెళ్లారు. సాథి పోర్టల్ అమలులో భాగంగా విత్తన సంచులకు క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రాష్ట్రంలోని 617 క్లస్టర్లలో 77,125 మంది రైతులు భాగస్వాములయ్యారని వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ ఉప మిషన్ కింద 2026–27లో రూ.147.91 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. అక్టోబర్ 15 నాటికి డీబీటీ పోర్టల్‌లో రాష్ట్రాన్ని చేర్చే ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 617 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) ఏర్పాటయ్యాయని, మద్దతు ధర సేకరణలో పీఏసీఎస్‌లతో సమానంగా ఎఫ్‌పీఓలకు అవకాశం కల్పిస్తూ జీవో ఆర్టీ నం.390 జారీ చేసినట్లు వివరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద నారాయణపేట, జోగులాంబ గద్వాల, జనగాం, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఎంపికైనట్లు తెలిపారు.
డిజిటల్ వ్యవసాయంలో వేగం
రైతు రిజిస్ట్రీలో ఇప్పటివరకు 52.33 లక్షల రైతు ఐడీలు, అంటే 89 శాతం నమోదయ్యాయి. 1.51 కోట్ల భూ కమతాలను అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ప్రక్రియను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల విక్రయ ఫ్రేమ్‌వర్క్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్‌ను సెప్టెంబర్ 2 నాటికి రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాల్లో అమలు చేశారు. గోవా తర్వాత దేశంలో పూర్తిస్థాయిలో ఎఫ్‌ఎఫ్‌ఎస్ అమలు చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రబీ 2026–27 డిజిటల్ పంటల సర్వేను రాష్ట్రంలోని 10,460 గ్రామాల్లో చేపట్టి.. 2027 మార్చి 31 నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందేలా కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) సంతృప్తీకరణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. సదస్సులో తెలంగాణ వ్యవసాయ శాఖ వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, కార్యదర్శి కే సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బీ గోపి, ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ భాషాతోపాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, సాధిస్తున్న పురోగతిని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు.. అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని కోరినట్లు అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!
సెప్టెంబర్ 28, 2026

Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది
సెప్టెంబర్ 28, 2026

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే
- ●NSE | ఎన్ఎస్ఈ షేర్లకు తొలి ఎదురుదెబ్బ.. ఐపీఓ ధర కంటే దిగువకు..
- ●Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!
- ●Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - సినిమాలకు మించి రెమ్యూనరేషన్?
- ●True Caller | ట్రూకాలర్ కొత్త టూల్.. ఫోన్ నంబర్, లింక్, మెసేజ్‌లను చెక్ చేయొచ్చు..
- ●Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే

NSE | ఎన్ఎస్ఈ షేర్లకు తొలి ఎదురుదెబ్బ.. ఐపీఓ ధర కంటే దిగువకు..

Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - సినిమాలకు మించి రెమ్యూనరేషన్?



