త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 13 వరకు నియామక పరీక్షలు

TGPSC | వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన కమిషన్‌.. తాజాగా పరీక్షల తేదీలను వెల్లడించింది. మొత్తం నాలుగు నియామక పరీక్షలను అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 13 వరకు నిర్వహించనుంది.

P

Telangana | Published On Sep 28, 2026, 4.28 pm IST

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 13 వరకు నియామక పరీక్షలు
Advertisement

TGPSC | వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన కమిషన్‌.. తాజాగా పరీక్షల తేదీలను వెల్లడించింది. మొత్తం నాలుగు నియామక పరీక్షలను అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 13 వరకు నిర్వహించనుంది. అన్ని పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలోని అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ (అనలిస్ట్‌ గ్రేడ్‌–II) పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 24న పరీక్ష జ‌రుగ‌నుంది. ఈ పోస్టుకు సంబంధించిన నియామక నోటిఫికేషన్‌ను ఏప్రిల్‌ 20న కమిషన్‌ జారీ చేసిన విష‌యం తెలిసిందే.

26న అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలోనే అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 26న పరీక్ష జరగనుంది. ఈ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌ జూన్‌ 2న వెలువడింది. అలాగే, రోడ్లు, భవనాల శాఖలోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టుల భర్తీకి నవంబర్‌ 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టుకు సంబంధించి జూన్‌ 2న నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌/గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌–I పోస్టుల భర్తీకి నవంబర్‌ 12, 13 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మే 6న విడుదలైంది. నాలుగు నియామక పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు పరీక్షల తేదీలను గమనించి అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించింది.

Advertisement
Advertisement