KTR | నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? : రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR | కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు.. నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? అని సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద నరమేథం సృష్టించిన హిట్లర్ నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా అని విమర్శించారు.
KTR | త్రినేత్ర.న్యూస్: కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు.. నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? అని సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద నరమేథం సృష్టించిన హిట్లర్ నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా అని విమర్శించారు. ఈమేరకు ఆదివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.
నయా నాజీ పాలనకు నిజమైన సాక్ష్యాలు..
మొన్న ప్రజా పాలన అన్నావ్, నిన్న ఇందిరమ్మ పాలన అన్నవ్, నేడు "హిట్లర్ పాలన" అని ఒప్పుకున్నావ్. రెండున్నరేళ్ల నీ రాక్షస పాలన ఆనవాళ్లు నిజంగానే హిట్లర్ అరాచకాన్నే తలపించాయి. యుద్ధం మిగిల్చే విషాదాల్నే మించిపోయాయి. హైడ్రా నుంచి మూసీ వరకు.. లగచర్ల నుంచి వెలుగుమట్ల వరకు పేదలపై విరుచుకుపడిన నీ బుల్‌డోజర్లు “నయా నాజీ” పాలనకు నిజమైన సాక్ష్యాలు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాజ్యాంగ వ్యవస్థకే ప్రమాదకరం..
పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను సంక్షోభాల పాతాళంలోకి నెట్టిన నాడే నీ నియంత పోకడలు బయటపడ్డాయి. విధ్వంసమే నీ విధానమని, వికాసం అంటే నీకు తెలియదని, ఇంత నిర్లజ్జగా ఒప్పుకున్న నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం రాజ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం. ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను నిలువెత్తు కీర్తించే దుర్మార్గమైన మనస్తత్వం స్వతంత్ర భారతావనిలోనే ఓ చీకటి అధ్యాయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
మరో విముక్తి పోరాటం తథ్యం..
ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి! తెలంగాణ గ్రామగ్రామాన లేచిన ఉక్కు పిడికిళ్లు రాష్ట్ర పొలిమేరల దాకా వారిని తరిమికొట్టాయి! తలకెక్కిన అధికారంతో విర్రవీగిన హిట్లర్‌కు ఆనాడు ఏ గతి పట్టిందో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం! హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకునేందుకు ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం! హిట్లర్ హటావో! తెలంగాణ బచావో!! అని ఈ సందర్భంగా కేటీఆర్ నినదించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Women’s T20 World Cup | చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ : జై షా
- ●Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు
- ●CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?
- ●MK Stalin | విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కాదు.. మూడు నెలలు ఉండేలా లేదు : స్టాలిన్
- ●CM Revanth Reddy | నా కుడి వైపున మహిళలే ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Women’s T20 World Cup | చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ : జై షా

Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?





