త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | హైడ్రా ప్ర‌జావాణికి విరామం.. మ‌ళ్లీ ఎప్పుడంటే

HYDRAA | మ‌రో రెండు వారాల పాటు హైడ్రా ప్ర‌జావాణికి విరామం ప్ర‌క‌టించారు. ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 8వ తేదీతో పాటు 15వ తేదీన కూడా ర‌ద్దు చేసిన‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శ‌నివారం ఎక్స్ ఖాతా పోస్టులో పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఈ కార్య‌క్ర‌మం య‌థాత‌థంగా కొనసాగుతుంద‌ని తెలిపారు.

S

Hyderabad | Published On Jun 7, 2026, 6.49 pm IST

HYDRAA | హైడ్రా ప్ర‌జావాణికి విరామం.. మ‌ళ్లీ ఎప్పుడంటే
Advertisement

HYDRAA | త్రినేత్ర‌.న్యూస్: మ‌రో రెండు వారాల పాటు హైడ్రా ప్ర‌జావాణికి విరామం ప్ర‌క‌టించారు. ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 8వ తేదీతో పాటు 15వ తేదీన కూడా ర‌ద్దు చేసిన‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శ‌నివారం ఎక్స్ ఖాతా పోస్టులో పేర్కొన్నారు. మిగిలి ఉన్న ముఖ్య ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించాల్సి ఉండ‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు. ఈనెల 22 నుంచి ఈ కార్య‌క్ర‌మం య‌థాత‌థంగా కొనసాగుతుంద‌ని తెలిపారు.

పెండింగ్ ఫిర్యాదులు క్లియ‌ర్ చేసే క్ర‌మంలో ఇప్ప‌టికే గ‌త‌ మే 11వ తేదీ నుంచి 4 సోమ‌వారాలు ప్ర‌జావాణికి విరామం ఇచ్చిన విష‌యం విదిత‌మే. షెడ్యూల్ ప్రకారం జూన్ 8న ప్రజావాణి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రజావాణితో పాటు వివిధ రూపాల్లో అందిన ఫిర్యాదులన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ విరామ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ ఎ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement