త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | 11వ తేదీ వ‌ర‌కు భారీ వ‌ర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ..!

Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హైద‌రాబాద్( IMD Hyderabad ) వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

S

Telangana | Published On Jun 7, 2026, 5.24 pm IST

Heavy Rains | 11వ తేదీ వ‌ర‌కు భారీ వ‌ర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ..!
Advertisement

Heavy Rains | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హైద‌రాబాద్( IMD Hyderabad ) వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. నేటి నుంచి గురువారం వ‌ర‌కు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ఉరుములు, మెరుపులు కూడా సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఎల్లో అల‌ర్ట్( Yellow Alert ) జారీ చేసింది. ఎల్లో అల‌ర్ట్ అంటే మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అర్థం.

హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, బ‌ల‌మైన ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. నిన్న కురిసిన భారీ వ‌ర్షం నేప‌థ్యంలో 40 డిగ్రీల‌కు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయ‌ని తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ పేర్కొంది. ఆదివారం ఖైర‌తాబాద్‌లో అత్య‌ల్పంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, అత్య‌ధికంగా బండ్ల‌గూడ‌లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

Advertisement
Advertisement