Yennam Srinivas Reddy | పేపర్ లీక్‌లతో ప్రమాదంలో యువత భవిష్యత్తు : విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Yennam Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని, వరుస ప్రశ్నాపత్రాల లీక్‌లతో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని అన్నారు.
Yennam Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని, వరుస ప్రశ్నాపత్రాల లీక్‌లతో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీక్‌లకు బాధ్యులపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం గొంతెత్తిన వారిపై లాఠీచార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
నిరుద్యోగ యువత ఆవేదనను అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తోందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోట్లాది మంది విద్యార్థుల శ్రమను, లక్షలాది కుటుంబాల ఆశలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయిన పరీక్షా వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేసి, విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించే సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్‌లపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి నిజాలను దేశ ప్రజలకు వెల్లడించాలని, విద్యాశాఖ వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ బాధ్యత వహించాలని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యతతో వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం బలి చేయడం తగదని అన్నారు. యువత న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యువత ఆకాంక్షలను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయని, యువత ఆశయాలను గౌరవించని పాలన ఎక్కువకాలం నిలవదని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!






