త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | పేప‌ర్ లీక్‌లు అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు: ప్ర‌ధాని మోదీ

PM Modi | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ పేప‌ర్ లీక్‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వుతుండ‌టంతో ప్ర‌ధాని మోదీ (PM Modi) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు (Fast-track courts) ఏర్పాటు చేస్తామ‌న్న ప్ర‌ధాని.. పేప‌ర్ లీక్‌ల‌ను (Paper Leak) అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ‌పెడతామ‌ని చెప్పారు.

G

National | Published On Jul 24, 2026, 6.38 am IST

PM Modi | పేప‌ర్ లీక్‌లు అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు: ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ పేప‌ర్ లీక్‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వుతుండ‌టంతో ప్ర‌ధాని మోదీ (PM Modi) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు (Fast-track courts) ఏర్పాటు చేస్తామ‌న్న ప్ర‌ధాని.. పేప‌ర్ లీక్‌ల‌ను (Paper Leak) అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ‌పెడుతామ‌ని, దానిని ఆమోదిస్తామ‌ని చెప్పారు. ఈ బిల్లుపై శుక్ర‌వారం జ‌రిగే క్యాబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. పేప‌ర్ లీకేజ్‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే నిర్ణ‌యాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు అర్ధ‌రాత్రి ఒక సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు.

‘పేపర్‌ లీక్‌ అనేది సాధారణ అంశం కాదని నాకు తెలుసు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపాం. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకూడ‌ద‌ని తిరిగి పరీక్ష నిర్వహించాం. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. అందుకే గత రెండున్నర నెలల్లో పలు చర్యలు తీసుకున్నాం. మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం. అందుకే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించా. ప‌రీక్ష విధానంలో సంస్క‌ర‌ణ‌లు తెస్తాం. శుక్రవారం జరిగే క్యాబినెట్‌ భేటీలో ప్ర‌త్యేక‌ బిల్లుపై చర్చిస్తాం. త్వరలో పార్లమెంటులో బిల్లు పెడతాం’ అని వీడియో సందేశంలో ప్రధాని వివరించారు.

 

Advertisement
Advertisement