త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | వీడియో ప్ర‌క‌ట‌న‌లు కాదు.. పార్ల‌మెంట్‌లో మాట్లాడండి.. మోదీకి ఖ‌ర్గే కౌంట‌ర్‌

Mallikarjun Kharge | పేప‌ర్ లీక్‌ల గురించి ప్ర‌ధాని మోదీ (PM Modi) వీడియోల ద్వారా వ‌న్‌సైడ్ మ‌న్‌కీ బాత్ (one sided Mann Ki Baat) వినిపించ‌డం ఏంట‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) ప్ర‌శ్నించారు. ఈ అంశంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌సంగించాల‌ని డిమాండ్ చేశారు.

D

National | Published On Jul 24, 2026, 12.10 pm IST

Mallikarjun Kharge | వీడియో ప్ర‌క‌ట‌న‌లు కాదు.. పార్ల‌మెంట్‌లో మాట్లాడండి.. మోదీకి ఖ‌ర్గే కౌంట‌ర్‌
Advertisement

Mallikarjun Kharge | పేప‌ర్ లీక్‌ల‌ను (Paper Leak) అరిక‌ట్టేలా పార్ల‌మెంట్‌లో బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తామంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) చేసిన ప్ర‌క‌ట‌న‌ను రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష‌నేత, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే తీవ్రంగా స్పందించారు. పేప‌ర్ లీక్‌ల గురించి ప్ర‌ధాని మోదీ వీడియోల ద్వారా వ‌న్‌సైడ్ మ‌న్‌కీ బాత్ (one sided Mann Ki Baat) వినిపించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఈ అంశంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌సంగించాల‌ని డిమాండ్ చేశారు. "పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు.. ప్రధాని సభలోనే ప్రకటన చేయాలి. అలా కాకుండా పార్లమెంట్ వెలుపల ఏకపక్షంగా మన్ కీ బాత్ వినిపించ‌కూడ‌దు" అని ఖ‌ర్గే ఎక్స్‌లో రాసుకొచ్చారు.

పేప‌ర్ లీక్‌ల‌ను (Paper Leak) అరిక‌ట్టేలా వ‌చ్చేవారం పార్ల‌మెంట్‌లో బిల్లు (Paper Leak Law) ప్ర‌వేశ‌పెడతామ‌ని, ప్ర‌తిపాది చ‌ట్టంపై శుక్ర‌వారం కేంద్ర కేబినెట్‌లో చ‌ర్చిస్తామ‌ని గురువారం రాత్రి మోదీ ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఖ‌ర్గే స్పందిస్తూ.. పార్ల‌మెంట్‌కు వ‌చ్చే ముందు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి, వారిపై లాఠీఛార్జ్ చేసేలా ఆదేశాలిచ్చిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆ త‌ర్వాతే విద్యావ్య‌వ‌స్థ‌పై స‌మ‌గ్ర చ‌ర్చ‌కు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఖ‌ర్గే వెల్ల‌డించారు.

పేప‌ర్ లీక్‌లు అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు

కాగా, నీట్ పేప‌ర్ లీక్‌, దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌పై దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు నిర‌స‌న‌లు తీవ్ర‌త‌రం చేసిన విష‌యం తెలిసిందే. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను (Fast-track court) ఏర్పాటు చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్ర‌ధాని మోదీ.. పేప‌ర్ లీక్‌ల‌ను (Paper Leak) అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ‌పెడతామ‌ని తాజాగా ప్ర‌క‌టించారు. ఈమేర‌కు అర్ధ‌రాత్రి ఒక సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు.

‘పేపర్‌ లీక్‌ అనేది సాధారణ అంశం కాదని నాకు తెలుసు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపాం. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకూడ‌ద‌ని తిరిగి పరీక్ష నిర్వహించాం. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. అందుకే గత రెండున్నర నెలల్లో పలు చర్యలు తీసుకున్నాం. మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం. అందుకే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించా. ప‌రీక్ష విధానంలో సంస్క‌ర‌ణ‌లు తెస్తాం. శుక్రవారం జరిగే క్యాబినెట్‌ భేటీలో ప్ర‌త్యేక‌ బిల్లుపై చర్చిస్తాం. త్వరలో పార్లమెంటులో బిల్లు పెడతాం’ అని వీడియో సందేశంలో ప్రధాని వివరించారు.

Advertisement
Advertisement