Revanth Reddy | పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన.. డిసెంబర్ నాటికి కొడంగల్ బీడు భూములు తడుపుతా
Revanth Reddy | పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన అని.. డిసెంబర్ నాటికి కొడంగల్ (Kodangal)కు కృష్ణా నీళ్లు (Krishna Water) తీసుకొచ్చి బీడు భూములను తడుపుతానని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.
- పచ్చని పంటలు పండేలా చేస్తా
- ఎవడడ్డొచ్చినా తొక్కుకుంటూ కృష్ణా జలాలు తీసుకొస్తా
- ఇక్కడి ప్రజలు అండగా ఉంఏ మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తా
- సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తాం
- అందరం కలిసి ఎల్‌నినోను ఎదుర్కొందాం
- పది జన్మలెత్తినా కేటీఆర్ రేవంత్ కాలేడు
- లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన అని.. డిసెంబర్ నాటికి కొడంగల్ (Kodangal)కు కృష్ణా నీళ్లు (Krishna Water) తీసుకొచ్చి బీడు భూములను తడుపుతానని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఎవడడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్లి నీళ్లు తీసుకొచ్చి పచ్చని పంటలు పండిస్తానన్నారు. ఇక్కడి ప్రజలు అండగా ఉంటే మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తానని వ్యాఖ్యానించారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో సోమవారం ఏర్పాటు చేసిన రైతు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తామని.. అందరం కలిసి ఎల్‌నినోను ఎదుర్కొందామని పునరుద్ఘాటించారు. పది జన్మలెత్తినా కేటీఆర్ రేవంత్ కాలేడని ఫైరయ్యారు.
బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. మన పొలాలకు నీళ్లు అందించలేదు.. ఈ 75 ఏండ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదు. ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన కెసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మాం. తెలంగాణ రావాలని.. కష్టాలు తీరాలని కనిపించిన దేవుడికల్లా దండం పెట్టాం.
నాకు అప్పు చేసే అలవాటు లేదు.. అబద్ధాలు అసలే చెప్పా
తెలంగాణ వచ్చినా.. ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్ కు పోయిండు. భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టాడు. కక్షగట్టి పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడు. ఇన్నేండ్లు ఏ దేవుడు మన కష్టాలు వినలేదు. 2023లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో.. కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఏ ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదు. పదేళ్లలో కేసీఆర్ 8 లక్షల 11 వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు.
నాకు అప్పు చేసే అలవాటు లేదు.. అబద్ధాలు చెప్పే అలవాటు అసలే లేదు.
తింటే కుంభకర్ణుడు.. పంటే బకాసురుడు
ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలు చూసి 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని ఆలోచన చేశాం. 2024, జనవరి 1 నుంచి ప్రతీ నెల మొదటి తారీఖున జీతాలు పడుతున్నాయ్. ప్రతీ సంవత్సరం కేసీఆర్ అప్పులకు తప్పులకు 80 వేల కోట్లు చెల్లిస్తున్నాం. కేసీఆర్ అప్పులకు తప్పులకు ఈ 34 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా చెల్లించాం. మాట్లాడాలి రమ్మంటే కెసీఆర్ రాడు. ఆయన తింటే కుంభకర్ణుడు.. పంటే బకాసురుడు.
గడ్డం సరే.. బుద్ధికి ఎన్నేండ్లో మరి..
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులు మేం మొదలు పెడితే.. కెసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటామంటున్నారు. కేటీఆర్ కు గడ్డం రావడానికి 50 ఏండ్లు పట్టింది. బుద్ది రావడానికి ఎన్నేండ్లు పడుతుందో. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎన్నటికీ నక్క పులి కాదు. కేటీఆర్ నువ్ గడ్డం పెంచుకున్నా.. గడ్డం మోకాల్ల వరకు పెంచుకున్నా ఎన్నటికీ రేవంత్ కాలేవు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి. నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ కావాలి. పది జన్మలు ఎత్తినా నువ్వు రేవంత్ రెడ్డి కాలేవు.
మేం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసుకుంటే మీకు కడుపుమంట ఎందుకు? ఆనాడు కొడంగల్ బిడ్డలు చదువుకోవాలంటే పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేది. ఇవాళ కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా చేసి.. ఉన్నత చదువులకు కొడంగల్ వచ్చేలా చేసుకుంటున్నాం. కొడంగల్ అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారు. ఇవాళ 9 వేల కోట్లతో కొడంగల్ లో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాం.
రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి… అభివృద్ధి పథంలో నడిపిస్తాం. కొడంగల్ ప్రజలు అండగా ఉంటే ఢిల్లీలో మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తా.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా
నిరంతరం పనిచేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది. ప్రజాబలంతో సునామీ సృష్టిస్తాం. ఆ సునామీలో మోడీ, కేడీ కొట్టుకుపోతారు. జర్నలిస్టులు అధైర్యపడొద్దు.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని రేవంత్ హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Celebrities Diwali 2026 Celebrations | సినీ తారల దీపావళి ధమాకా.. స్పెషల్ ఫోటో గ్యాలరీ!
- ●Hyderabad Air Pollution 2026 | మరో ఢిల్లీలా మారుతున్న హైదరాబాద్.. విషగాలిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగరం
- ●Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మరణం
- ●Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి
- ●Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం
- ●Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Celebrities Diwali 2026 Celebrations | సినీ తారల దీపావళి ధమాకా.. స్పెషల్ ఫోటో గ్యాలరీ!

Hyderabad Air Pollution 2026 | మరో ఢిల్లీలా మారుతున్న హైదరాబాద్.. విషగాలిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగరం

Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మరణం

Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి























