త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Suicide in Vikarabad | ప్రభుత్వ ఉద్యోగం రాగానే వదిలేశాడు.. రైలు కింద పడి యువతి ఆత్మహత్య

తన పక్క గ్రామానికి చెందిన గడ్డం మాణిక్య అనే వ్యక్తితో గత కొంతకాలంలో ప్రేమలో ఉంది సితారమ్మ. ఇటీవల మాణిక్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో అప్పటి నుంచి సితారమ్మను మాణిక్య దూరం పెడుతున్నాడు.

J

Telangana | Published On Jan 13, 2026, 4.48 pm IST

Woman Suicide in Vikarabad | ప్రభుత్వ ఉద్యోగం రాగానే వదిలేశాడు.. రైలు కింద పడి యువతి ఆత్మహత్య
Advertisement

Woman Suicide in Vikarabad | ప్రేమ గుడ్డిది అంటారు కానీ ప్రేమలో కూడా అన్ని కంఫర్టులు చూసుకుంటున్నారు నేటి తరం. తమ స్టేటస్‌కు తగ్గట్టు ఉండేవాళ్లనే ప్రేమిస్తున్నారు. ఒకవేళ తమ స్టేటస్‌కు తగ్గట్టుగా లేకపోతే నిర్మొహమాటంగా వదిలేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమ్మని సితారమ్మ అనే 27 ఏళ్ల మహిళ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తోంది. తన పక్క గ్రామానికి చెందిన గడ్డం మాణిక్య అనే వ్యక్తితో గత కొంతకాలంలో ప్రేమలో ఉంది సితారమ్మ. ఇటీవల మాణిక్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో అప్పటి నుంచి సితారమ్మను మాణిక్య దూరం పెడుతున్నాడు.

కట్నం ఎక్కువగా ఇచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నీతో పని లేదు అన్నట్టుగా ఆ యువతితో వ్యవహరించడంతో సితారమ్మ చాలా బాధపడింది. తనను పెళ్లి చేసుకుంటావా? లేదా? అంటూ నిలదీసింది. తన ఇంటికి వెళ్లి కూడా బతిమిలాడింది. అయినా కూడా మాణిక్య వినలేదు. పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పాడు. దీంతో మానసికంగా బాధపడిన సితారమ్మ కొత్తగాడి ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్స్ మీదికి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్స్ నుంచి యువతి మృతదేహాన్ని తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement